ఎవ్వరూ ఊహించని విధంగా తన వందో సినిమాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి భారీ చారిత్రక చిత్రాన్ని చేసి ఆశ్చర్యపరిచాడు నందమూరి బాలకృష్ణ. ఇక బాలయ్య 101వ సినిమా ఏదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కృష్ణవంశీ ‘రైతు’తో పాటుగా కొన్ని సినిమాలు ఆయన పరిశీలనలో ఉన్నాయి. కానీ ఇంకా ఏదీ ఖరారవ్వలేదు. ఇలాంటి తరుణంలో తన తండ్రి మీద సినిమా తీయబోతున్నట్లు బాలయ్య చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో తన తండ్రి పాత్రను పోషించేది కూడా తనేనని బాలయ్య వెల్లడించడం విశేషం. సోమవారం బాలకృష్ణ తన తండ్రి సొంత ఊరైన నిమ్మకూరు (కృష్ణా జిల్లా)లో పర్యటించిన సందర్భంగా ఈ విషయం తెలిపాడు.
ఎన్టీఆర్ జీవిత చరిత్ర చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని.. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో తానే నటిస్తానని బాలకృష్ణ చెప్పాడు. ఈ సినిమాకు దర్శకుడు.. నిర్మాత.. ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని బాలయ్య తెలిపాడు. ఈ సినిమాలో అన్ని కోణాలూ ఉంటాయని.. తన బంధువులు.. ఎన్టీఆర్ సన్నిహితులను కలిసి.. ఆయన చిన్నప్పటి విశేషాలను కూడా పూర్తిగా తెలుసుకుని కథను సిద్ధం చేస్తామని బాలకృష్ణ చెప్పాడు. గత ఏడాది బాలయ్య వందో సినిమాగా ‘రామారావు’ అనే చిత్రం ఒకటి తెరమీదికి వచ్చింది. అనిల్ రావిపూడి ఆ కథను రెడీ చేశాడు. ఐతే బాలయ్యకు అది నచ్చినా.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కే ఓటేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ జీవిత కథతో సినిమా అంటున్నాడు బాలయ్య. మరి అనిల్ రావిపూడి చెప్పిన కథ ఇదేనా? ఇంతకీ ఈ చిత్రం వెంటనే తెరమీదికి వెళ్తుందా.. లేక ఆలస్యమవుతుందా? చూద్దాం మరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/