ఒక్క హిట్టు పడితే చాలు మన హీరోల పారితోషికాలు చుక్కలనంటేస్తుంటాయన్నది అందరికి తెలిసిందే. ప్రతీ హీరో, హీరోయిన్ కరోనా తరువాత తమ రెమ్యునరేషన్ లని భారీ స్థాయిలో పెంచేశారు. అయితే సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ తరువాతే తన పారితోషికాన్ని పుంచేశాడు. గత ఏడాది డిసెంబరన్ లో విడుదలైన హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా 'అఖండ'. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మూవీ వరుస ఫ్లాపుల్లో వున్న బాలకృష్ణకు సాలీడ్ బ్లాక్ బస్టర్ ని అందించింది.
దీంతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసిన నందమూరి బాలకృష్ణ అదే ఊపుతో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో చేస్తున్న NBK 107 ప్రాజెక్ట్ కి భారీగా పారితోషికాన్ని పెంచేశాడు. అంతుకు ముందు ఒక్క ప్రాజెక్ట్ కు రూ. 18 కోట్లకు మించి తీసుకోని బాలయ్య ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో పారితోషికం పెంచేశాడట.
ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ని, రిలీజ్ డేట్ ని ఈ నెల 21న కర్నూల్ లో కొండారెడ్డి బురుజు సాక్షిగా ప్రకటించబోతున్నారు.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణ తన పారితోషికాన్ని మరింతగా పెంచేసినట్టుగా తెలుస్తోంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో చేస్తున్న NBK 107 ప్రాజెక్ట్ ని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటున్న బాలయ్య ఈ మూవీ తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108 వ ప్రాజెక్ట్ ని చేయబోతున్న విషయం తెలిసిందే.
నానితో 'టక్ జగదీష్' వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని నిర్మించిన షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ మూవీని నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. బాలయ్య కూతురిగా 'పెళ్లిసందD' ఫేమ్ శ్రీలీల నటించనుంది.
ఇదిలా వుంటే బాలయ్య తను నటిస్తున్న '107' మూవీకి రికార్డు స్థాయి బిజినెస్ జరగడంతో అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ కు పారితోషికాన్ని భారీగా పెంచేశారట. ఈ మూవీ కోసం ఏకంగా బాలయ్య రూ. 25 కోట్లు తీసుకుంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీని 2023 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.