నందమూరి బాలకృష్ణ 60వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న రిలీజ్ చేసిన ఆయన కొత్త సినిమా టీజర్ భలేగా పేలింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా టీజర్‌ను తీర్చిదిద్దారు. అందులో బాలయ్య పేల్చిన డైలాగ్ అప్పుడే వైరల్ అయిపోయింది. ‘‘ఎదుటివాడితో మాట్లాడేటపుడు ఎలా మాట్లాడాలో తెలుసుకో. శ్రీను గారు మీ నాన్న బాగున్నారా ? అనడానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా? అనడానికి చాలా తేడా ఉంటుందిరా లండీకొడకా’’.. అంటూ పవర్ ఫుల్ డైలాగ్ వదిలాడు బాలయ్య. నీ అమ్మా మొగుడు అనే ఊతపదాన్ని ఉపయోగించే ఏపీ మంత్రి కొడాలి నానిని ఉద్దేశించే బాలయ్య ఈ డైలాగ్ పేల్చాడన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
ఐతే బోయపాటి ఈ డైలాగ్ పెట్టడానికి ఏపీకే చెందిన మరో మంత్రి పేర్ని నాని స్ఫూర్తిగా నిలిచాడేమో అన్న సందేహాలు కలుగుతున్నాయిప్పుడు. ఇప్పుడు టీజర్లో వినిపించిన డైలాగ్ తరహాలోనే ఆయన గతంలో ఓ టీవీ ఛానెల్లో మాట్లాడుతూ వ్యాఖ్యానించడం విశేషం. అప్పుడు చర్చ ఏంటో తెలియదు కానీ అందులో పేర్ని నాని మాట్లాడుతూ.. ‘‘మీరు మా ఇంటి దగ్గరికొచ్చారు సార్.. మా ఇంటికొచ్చి బయటి నుంచి వచ్చి మీ నాన్నగారున్నారా నాని గారున్నారా అని అడిగారనుకోండి. మా భార్య లేదా మా అబ్బాయి రండి సార్, లోపలున్నారు అంటారు. అలా కాకుండా బయటి నుంచి ‘నీ అమ్మా మొగుడున్నాడా’ అని అడిగితే ఎలా సమాధానం చెబుతారు. ఒక్కొక్క రకంగా రియాక్టవుతారు. అడిగే భాషను బట్టి సమాధానం కూడా వస్తుంది’’ అన్నారు. ఇప్పుడీ వ్యాఖ్యల తాలూకు వీడియో తీసుకొచ్చి కొందరు నెటిజన్లు.. బాలయ్య డైలాగ్‌తో పోలుస్తున్నారు. బోయపాటి ఇది చూసే ఆ డైలాగ్ పెట్టి ఉంటాడని అంటున్నారు. ఐతే కొడాలి నానికి ‘నీ అమ్మా మొగుడు’ అనే ఊత పదం ఉన్న సంగతి పేర్ని నానికి తెలియకుండా ఉంటుందా? అయినా టీవీ ఛానెల్ చర్చలో అలాంటి వ్యాఖ్యలు ఎలా చేశారు అన్నదే అర్థం కాని విషయం.