వందవ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకొని పుట్టిన రోజు వేడుకలను జరుపుకొనేందుకు అగ్రరాజ్యం అమెరికా వెళ్లిన నందమూరి బాలకృష్ణ రాకింగ్ స్టార్ లాగా మారారు. సతీమణతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్న బాలయ్యబాబు పనిలో పనిగా వివిధ కంపెనీల్లో సైతం ఓ రౌండ్ వేశారు. ఈ క్రమంలో విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ కంపెనీకి బాలయ్య వెళ్లి సందడి చేశారు.
బోయింగ్ కంపెనీ సందర్శనకు వెళ్లిన బాలయ్యకు ఆ కంపెనీలో పనిచేసే తెలుగువారి నుంచి ఆత్మీయ స్వాగతం లభించింది. తన సతీమణితో కలిసి అక్కడ చక్కర్లు కొట్టిన బాలకృష్ణ బోయింగ్ కంపెనీ తయారు చేసే విమానాల గురించి వారి నుంచి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అక్కడి తెలుగువారితో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తున్నాయి. ఇదిలాఉండగా బాలయ్య పర్యటనతో బోయింగ్ కంపెనీపై కొత్త అంచనాలు మొదలయ్యాయి. సన్ రైజ్ స్టేట్ గా పేరుపొందిన ఏపీలో బోయింగ్ కంపెనీ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందా అంటూ పలువురు చిట్‌చాట్ చేస్తున్నారు.