తమిళ్ లోకి బాలయ్య బ్లాక్ బస్టర్

Update: 2017-05-25 05:25 GMT
నందమూరి బాలకృష్ణ కెరీర్ బిగ్గెస్ట్ మూవీ.. గౌతమిపుత్ర శాతకర్ణి. బాలయ్య వందో సినిమాగా వచ్చిన ఈ చిత్రం.. తెలుగు చక్రవర్తి ఖ్యాతిని చాటింది. బాలయ్యకు తొలి సారి 50 కోట్ల షేర్ ను అందించిన మూవీగా ఈ ల్యాండ్ మార్క్ చిత్రం నిలిచింది. ఇప్పుడీ చిత్రాన్ని తమిళ్ లోకి అనువదించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ మధ్య చారిత్రక చిత్రాలపై తమిళ ప్రేక్షకులకు మక్కువ పెరుగుతోంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు బాలయ్య బ్లాక్ బస్టర్ ను అక్కడ రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. అక్కడి మార్కెట్ పై బాలయ్యకు అంతగా పట్టు లేకపోయినా.. ఈ సినిమాలో హీరోయిన్ శ్రియ కావడం.. ఎవర్ గ్రీన్ బ్యూటీ హేమమాలిని నటించడంతో.. ఆటోమేటిగ్గా హైప్ వస్తుందన్నది నిర్మాతల ఆలోచన. ఇప్పటికే డబ్బింగ్ పనులు కూడా మొదలయిపోగా.. త్వరలోనే ఫైనల్ వెర్షన్ ను సిద్ధం కానుందని తెలుస్తోంది. తమిళనాడు వ్యాప్తంగా మొదట 200లకు పైగా స్క్రీన్లలో తమిళ వెర్షన్ ను రిలీజ్ చేయనున్నారట. తమిళ వెర్షన్ టైటిల్ కూడా గౌతమిపుత్ర శాతకర్ణినే కావడం విశేషం.

నిజానికి ఈ గౌతమిపుత్ర శాతకర్ణి పాత్రను చేయాలనే కోరిక సీనియర్ ఎన్టీఆర్ కు ఉండేది. కానీ ఆయన రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో ఆ ప్రాజెక్టు సాధ్యపడలేదు. తండ్రి చేయాలని భావించిన పాత్రను తను చేసి మెప్పించారు కుమారుడు బాలకృష్ణ. తెలుగులో సెన్సేషన్ సృష్టించిన ఈ మూవీ.. తమిళ్ వెర్షన్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. తమిళ్ లో ఆర్ ఎన్సీ సినిమా అనే సంస్థ గౌతమిపుత్ర శాతకర్ణి ని రిలీజ్ చేయనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News