నెల రోజుల పాట బాలయ్య మొరాకోలో..

Update: 2016-04-25 05:31 GMT
ఒక ప్రక్కన మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా కోసం చేస్తున్న కసరత్తులు చూస్తుంటే.. అసలు బాలయ్య 100వ సినిమాకు కూడా ఇంకెన్ని రోజులు పడుతుందో అని అప్పట్లో భయం వేసేది. అయితే మన నందమూరి హీరో మాత్రం చాలా ఫాస్టుగా ఒక కథను చేసుకుని.. వెంటనే ''గౌతమీపుత్ర శాతకర్ణి'' ప్రాజెక్టును ఎనౌన్స్‌ చేయడమే కాదు.. లాంచ్‌ చేసేశారు కూడా.

ఇప్పుడిక షూటింగ్‌ కు కూడా బయలుదేరుతున్నారు. క్రియేటివ్‌ డైరక్టర్‌ క్రిష్‌ సారథ్యంలో మేజర్‌ యాక్షన్‌ పార్టును షూట్‌ చేయడానికి మనోళ్ళు మొరాకో దేశం వెళుతున్నారు. అప్పట్లో ఇక్కడి శాతకర్ణి రాజరికం చేసిన టైములో కోటలూ గట్రా ఎలా ఉండేవో.. మొరాకో దేశంలో కొన్ని ప్రాంతాలు అలాగే ఉంటాయట. అందుకే సెట్‌ వేయకుండా యాక్షన్‌ సన్నివేశాలను అక్కడ చిత్రీకరించి.. వాటికి విజువల్‌ ఎఫెక్ట్స్ లో టచప్‌ చేయాలని నిర్ణయించుకున్నారు.

ఇకపోతే మే తొలి వారంలో మొరాకో చేరుకునే బాలయ్య.. దాదాపు నెల నుండి 40 రోజులపాటు అక్కడే ఉంటారట. అక్కడీ దాదాపు యాక్షన్‌ సన్నివేశాలు.. అలాగే కొన్ని డైలాగ్‌ బేస్డ్ సీన్లు కూడా చిత్రీకరిస్తారట. నిజంగానే ఆరు నెలల్లో సినిమాను రిలీజ్‌ చేసేస్తారేమో మరి.
Tags:    

Similar News