అఖండ చిత్రంతో లయన్ రోర్ అంటే ఏంటో చూశారు తెలుగు ఆడియెన్. క్రైసిస్ లోనూ కలెక్షన్ల సునామీ అంటే ఏంటో బాలయ్య చూపించారు. అందుకే ఇప్పుడు క్రాక్ దర్శకుడితో కిరాక్ పుట్టించే ప్రయత్నంలో ఉన్నారు బాలయ్య. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నందమూరి బాలకృష్ణ యువ ఫిల్మ్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన అప్ కమింగ్ మూవీని స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
తాజా సమాచారం మేరకు .. 16 ఫిబ్రవరి 2022 నుండి తెలంగాణలోని సిరిసిల్లలో అధికారికంగా షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సినిమా పూజా కార్యక్రమం 13 నవంబర్ 2021న జరిగిన సంగతి తెలిసిందే. 2022 దసరాకి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేయనున్నారు.
ఈ సినిమాలో బాలయ్య సరికొత్త పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. యాక్షన్ ఎంటర్ టైనర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలను పోషించబోతున్నాడు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
బాలయ్యతో నిరూపించాలి..!
నిజానికి క్రాక్ చిత్రంతో రవితేజకు మాసివ్ హిట్ ఇచ్చి ట్రాక్ లోకి తెచ్చిన ఘనత గోపిచంద్ మలినేనికి చెందుతుంది. ఇప్పుడు అఖండ సంచలన విజయంతో మాంచి ఉపుమీదున్న నటసింహంతో పని చేయడం అంటే ఆషామాషీ కానేకాదు. కన్ఫామ్ గా హిట్టు కొట్టాలి. డైరెక్టర్ గా టాలీవుడ్ లో తన హవా సాగించాలంటే గోపిచంద్ మలినేనికి ఇది కూడా ఒక సవాల్ లాంటిది. ఇందులో నెగ్గాలని ఆకాంక్షిద్దాం.