ఫోటో స్టోరీ: సూపర్‌ స్టార్‌ కు స్పెషల్‌ ఇన్విటేషన్‌

Update: 2018-12-21 05:30 GMT
బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంను నిమ్మకూరులో నేడు అత్యంత వైభవంగా నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అతిరథ మహారథుల సమక్షంలో నిర్వహించబోతున్న విషయం తెల్సిందే. అప్పటి తరం హీరోలను ఈ వేడుక కోసం ప్రత్యేక అతిథులుగా బాలకృష్ణ ఆహ్వానించారు.

ఇటీవలే సూపర్‌ స్టార్‌ కృష్ణ ఇంటికి బాలకృష్ణ స్వయంగా వెళ్లి సినిమాకు సంబంధించిన విశేషాలను తెలియజేసి, సినిమా విజువల్స్‌ ను మరియు పోస్టర్స్‌ ను చూపించారు. ఆడియో విడుదల కార్యక్రమంకు హాజరు అవ్వాల్సిందిగా ప్రత్యేకంగా కోరడం జరిగిందట. కృష్ణ కూడా బాలయ్య ఇన్విటేషన్‌ ను మన్నించి తప్పకుండా హాజరు అవుతానంటూ హామీ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

‘ఎన్టీఆర్‌’ మూవీలో సూపర్‌ స్టార్‌ కృష్ణ పాత్ర ఉంటుందని, దాన్ని మహేష్‌ బాబు పోషించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై మాత్రం క్లారిటీ రాలేదు. కృష్ణ పాత్రను ఈ చిత్రంలో చూపించబోతున్నారా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కృష్ణ పాత్ర ఉంటే ఒక వేళ దాన్ని ఎవరు పోషించి ఉంటారు అనేది సినిమా విడుదలైతే కాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
Tags:    

Similar News