ఓ సినిమా ఫలితం తెలియడానికి.. ఇప్పుడు ఆ చిత్రం వసూలు చేసిన కలెక్షన్సే కొలమానం. గతంలో మాదిరిగా శతదినోత్సవాలు.. సెంటర్ల లెక్కలు లేవు కాబట్టి.. పక్కాగా వసూళ్లనే పరిగణించాలి. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు పోటీ పడగా.. వీటిలో జైసింహా ఒక్కటే హిట్ అనిపించుకుంది.
ఒకవైపు మిగిలిన సినిమాలు తుస్సుమనడం.. మరోవైపు ఫ్యాన్స్ కు కావాల్సిన ఎలిమెంట్స్ ను పర్ఫెక్ట్ గా బాలయ్య అందించడం.. జైసింహాను హిట్ బాట పట్టించాయి. గతేడాది సినిమాలను భారీ రేట్లకు అమ్మినా.. జైసింహాను మాత్రం బడ్జెట్ ప్రకారమే రేట్లు ఫిక్స్ చేసి విక్రయించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 27 కోట్ల రూపాయలకు విక్రయించగా.. పది రోజుల్లోనే ఈ 27 కోట్లను వసూలు చేసేసింది జైసింహా. నష్టాలు లేకపోగా.. పలు ఏరియాల్లోని ఎగ్జిబిటర్లకు లాభాలు రావడం కూడా మొదలైంది.
ఏపీలో 13.1 కోట్లు.. సీడెడ్ లో 5.35 కోట్లు.. నైజాంలో 4.1 కోట్లు చొప్పున.. మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి 22.55 కోట్లను జైసింహా వసూలు చేయగలిగింది. ఇతర ఏరియాల నుంచి కలుపుకుని.. వరల్డ్ వైడ్ గా 10 రోజుల్లో 45 కోట్ల గ్రాస్.. 27 కోట్ల షేర్ వసూలు చేసి హిట్ అయిపోయిన జైసింహా.. సంక్రాతి విన్నర్ అయిపోయింది.