#NBK 106 ప్ర‌యోగం విక‌టిస్తే త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

Update: 2020-02-03 16:30 GMT
స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల‌తో ప్ర‌యోగాలు చేస్తే వంద శాతం యాప్ట్ గా కుద‌రాలి. లేదంటే అభాసుపాలైపోవ‌డం ఖాయం. ఇక సెన్సేష‌న్స్ కోసం పాకులాడుతూ ఇంకేదైనా కొత్త‌ద‌నం కోసం ట్రై చేసినా అది క‌చ్ఛితంగా 200 శాతం పండాలి. ఆ రెండిటికి మ‌ధ్య స‌న్న‌ని థిన్ లైన్ మాత్ర‌మే అడ్డుగోడ‌గా నిలుస్తుంది. ప్ర‌యోగం స‌క్సెసైతే ఎంత బావుంటుందో.. విక‌టిస్తే స‌న్నివేశం అంతే దారుణంగా ఉంటుంది.  విక‌టిస్తే ఎలా ఉంటుందో బోయ‌పాటికి ఇంత‌కుముందే అనుభ‌వ‌మైంది. `విన‌య విధేయ రామా` చూసిన కామ‌న్ ఆడియెన్ కే ప‌క్కాగా అర్థ‌మైంది. గాల్లో త‌ల‌లు లేచి అనంతంలో క‌లిసిపోవ‌డం.. లాంటి సీన్లు చూసాక జ‌నం ఫ‌క్కున న‌వ్వుకున్నారు. అటు చ‌ర‌ణ్ కి ఇటు బోయ‌పాటికి త‌ల‌వొంపులు తెచ్చిన చిత్ర‌మది.

అందుకే ఈసారి బోయ‌పాటి ఎన్.బీ.కే 106లో అలాంటి కామెడీలు చేయ‌రు క‌దా! అంటూ జ‌నంలో ఒక‌టే గుస‌గుసలు వినిపిస్తున్నాయి. బాల‌య్య బాబుపై ప్రేమాభిమానులు స్వ‌త‌హాగానే బోయ‌పాటికి కాస్తంత‌ ఎక్కువే కాబ‌ట్టి ఏమాత్రం ఎమోష‌న‌ల్ అయిపోక‌పోతే క‌చ్ఛితంగా సింహా త‌ర‌హాలో బ్యాలెన్స్ చేయ‌గ‌లుగు తార‌న‌డంలో సందేహం లేదు. ఎమోష‌న్ ఎక్కువైపోతేనే కొంత ఇబ్బందిక‌రం అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే బోయ‌పాటి మాత్రం సైలెంటుగా త‌న ప‌ని తాను చేసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం బాల‌య్య‌ను త‌న‌కు కావాల్సిన విధంగా బోయ‌పాటి సానబ‌డుతున్నారు. ఎన్.బీ.కే ఈసారి మునుపెన్న‌డూ క‌నిపించ‌నంత కొత్త‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఇంత‌కుముందు దుష్ఠ‌శిక్ష‌ణ చేసేవాడిగా.. లెజెండ్ గా క‌నిపించినా ఈసారి అందుకు పూర్తి విరుద్ధ‌మైన మ‌రో కొత్త వేషంతోనే క‌నిపించ‌బోతున్నారు. అది కూడా అఘోరా రూపంలో బాల‌య్య క్రోధం జ‌నాలు చూడ‌బోతున్నార‌ట‌. దారి త‌ప్పిన దుర్మార్గుల్ని దారికి తెచ్చే నిష్ఠ అత‌డి పాత్ర‌లో క‌నిపిస్తుంద‌ని ఊహాగానాలు సాగుతున్నాయి.

గ‌త కొంత‌కాలంగా బాల‌య్య గుండుతో క‌నిపిస్తున్నారు. ఈ గెట‌ప్ ఛేంజ్ వెన‌క చాలానే కార‌ణం ఉంద‌న్న టాక్ ఇప్ప‌టికే స్ప్రెడ్ అయ్యింది. అఘోరా లుక్ కోసమే ఆయ‌న ఈ సాహ‌సం చేస్తున్నారు. ఈ పాత్ర‌తో పాటు మ‌రో స‌ర్ ప్రైజ్ రోల్ లోనూ బాల‌య్య క‌నిపిస్తార‌ట‌.  ర‌క‌ర‌కాల లీకుల‌తో బాలకృష్ణ-బోయపాటి  కాంబినేష‌న్ పై అంచనాలు అంత‌కంత‌కు పెరుగుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి ఏమాత్రం రాజీకి రాకుండా నిర్మించ‌నున్నారని తెలుస్తోంది. త్వ‌రలోనే రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించి డిసెంబర్ లో విడుదల చేయ‌నున్నారు.


Tags:    

Similar News