టాలీవుడ్ కి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు - రికార్డ్ హిట్లు అందించారు వి.వి.వినాయక్. ఆది (2002) చిత్రంతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన వినాయక్ కెరీర్ లో సంచలనాలెన్నో. దిల్ - ఠాగూర్ - చెన్నకేశవ రెడ్డి - సాంబ - లక్ష్మీ - కృష్ణ - యోగి - అదుర్స్ - నాయక్ - అల్లుడు శ్రీను వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కించిన `ఠాగూర్` వినాయక్ ని మరో లెవల్ కి తీసుకెళ్లింది. ఆ సినిమా సంచలన విజయం సాధించి బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాయడంతో అటుపై అతడి క్రేజు ఆకాశాన్ని తాకింది. ఆ క్రమంలోనే వినాయక్ ని సెన్సేషనల్ డైరెక్టర్ అని పిలుచుకున్నారు అభిమానులు.
అయితే ఆ పేరుకు తగ్గట్టే మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ `ఖైదీనంబర్ 150` తెరకెక్కించి మరో సెన్సేషన్ కి తెర తీశాడు. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంగా రిలీజైన `ఖైదీనంబర్ 150` ఏకంగా 150కోట్ల గ్రాస్ - 100కోట్ల షేర్ వసూళ్లతో చరిత్ర తిరగరాసింది. అయితే అంత పెద్ద ఇండస్ట్రీ హిట్ చిత్రాన్ని ఇచ్చిన వినాయక్ కెరీర్ ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి. సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కించిన `ఇంటెలిజెంట్` పరాజయం పాలవ్వడం ఇబ్బంది పెట్టింది. అందుకే అతడు తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు నటసింహా నందమూరి బాలకృష్ణ అంత పెద్ద స్టార్ తో సినిమా చేయాలని పట్టుదలగా ఉన్నారు. ఇదివరకూ స్క్రిప్టు వినిపించినా కారణాంతరాల వల్ల వాయిదా పడింది ఈ ప్రాజెక్ట్.
2019-20లో ఎట్టి పరిస్థితిలో బాలయ్యతో సినిమా చేసి తీరాలన్న పంతంతో వినాయక్ ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నటసింహా బాలకృష్ణ.. ఎన్టీఆర్ (కథానాయకుడు - మహానాయకుడు) బయోపిక్ తో బిజీగా ఉన్నారు. తదుపరి వినాయక్ వినిపించే కథను ఫైనల్ చేసి సెట్స్ కెళతారనే అభిమానులు భావిస్తున్నారు. చెన్నకేశవరెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ ని తనకు అందించిన వినాయక్ కి బాలయ్య మరో ఛాన్సిస్తారనే అంచనా వేస్తున్నారు. నేడు వినాయక్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు.