రామ్ గోపాల్ వర్మ.. ఓ స్పెషల్ పీస్. జనాలు ఊహించినట్టు.. సొసైటీ ఎలా కావాలో అలా అయన మాట్లాడడు. అయనకు ఏది తోస్తే అది మాట్లాడతాడు. దాన్లో లాజిక్ ఉందని నమ్మేవాళ్ళు కొంతమందైతే.. అది మొత్తం వితండవాదమని విమర్శించేవాళ్ళు మరికొందరు. తాజగా తను సమర్పిస్తున్న 'భైరవగీత'ను జోరుగా ప్రమోట్ చేస్తున్నాడు.
ఈ సందర్బంగా ఒక ఇంటర్వ్యూ లో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడాడు వర్మ. ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకత్వం వహించాలని మీరు చాలాసార్లు అన్నారు.. మరేమైంది అని అడిగితే.. "ఆ టాపిక్ బాలకృష్ణ తో డిస్కషన్స్ వరకూ వెళ్ళలేదు. ఆయన బయోపిక్ గురించి నాతో మాట్లాడలేదు. బయోపిక్ కు సంబంధించి వారి సొంత ఐడియాలు వారికున్నాయి. కానీ నాకు మాత్రం ఎన్టీఆర్ జీవితంలోని చీకటి కోణం ఉన్న భాగాన్ని.. అయనకు లక్ష్మీ పార్వతి తో ఉన్న బంధం గురించి చెప్పాలని ఉండేది. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ లో నేను చూపించబోయేది అదే. నేను ఈ సినిమా ప్రకటించిన తర్వాత కూడా బాలకృష్ణ నాతో మాట్లాడలేదు." అని క్లారిటీ ఇచ్చేశాడు.
ఇక ఈ సినిమా స్క్రిప్ట్ ను లక్ష్మీ పార్వతి చూడాలని అడిగితే మీరేం చేశారు అని ప్రశ్నిస్తే.. "నేను ఆమెను ఒకటే అడిగాను. నన్ను నమ్మేపనైతే ముందు సినిమాను పూర్తిచేయనివ్వమని చెప్పాను. ఎందుకంటే నేను తర్వాతైనా స్క్రిప్ట్ ను మార్చే అవకాశం ఉందని చెప్పాను. ఆమె ఇంకేం మాట్లాడుతుంది.. నేను నిజాన్ని చూపించాలని బాధ్యత తీసుకున్నప్పుడు ఆమె నన్ను నమ్మాల్సిందే" అన్నాడు.
మీరు కావాలని ఈ సినిమాను ఎన్టీఆర్ బయోపిక్ విడుదల సమయానికి రిలీజ్ చేస్తున్నారా అని అడిగితే.. "అదేమీ ప్లాన్ చెయ్యలేదు. అప్పటికి సినిమా పూర్తవుతుంది.. సో.. నేను రిలీజ్ చేయాలని అనుకుంటున్నా. నాకు వేరే ఛాయిస్ లేదు. నాకు ఎవ్వరి ఫీలింగ్స్ ను హర్ట్ చేయాలనే కోరిక లేదు.. అలా అని నన్ను సినిమా రిలీజ్ చెయ్యనీకుండా ఎవ్వరూ ఆపలేరు.. నేనెవ్వరికీ భయపడను" అన్నాడు.