ఎన్టీఆర్‌ సినిమాలో ఉన్నవేంటి.. లేనివేంటి..?

Update: 2019-01-10 01:29 GMT
ఎన్టీఆర్‌ జీవితం తెరిచిన పుస్తకం. ఆయన లైఫ్‌ గురించి అభిమానుల నుంచి ప్రేక్షకుల వరకు అందరికి అన్నీ తెలుసు. అందుకే కథానాయకుడు సినిమాలో కొన్నింటిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తే.. ఇంకొన్నింటిని మాత్రం మర్చిపోయారు. అన్నింటికి మించి రాజకీయాల్లో ఆయన తన సామాజిక వర్గ ప్రతినిధిగా మారారని.. వారి ప్రోద్బలంతోనే పార్టీ పెట్టారని అందరూ అంటుంటారు. కథానాయకుడు సినిమాలో ఆ విషయాన్ని చూపించేందుకు క్రిష్‌ ఏమాత్రం వెనుకాడలేదు. నాదెండ్ల భాస్కరరావు - రామోజీరావు లాంటి వాళ్లు.. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టేలా ఎలా ప్రోత్సహించాలో స్పష్టంగా చూపించారు. మొదటిభాగంలో చాలా విషయాల్ని కవర్‌ చేసిన క్రిష్‌.. రెండో భాగంలో అసలు సిసలు రాజకీయాన్ని ఎలా చూపిస్తాడో చూడాలి. ఎందుకంటే.. అసలు నిజాలు చూపించాల్సిన అవసరం - ఆవశ్యకత రెండో భాగంగాలోనే ఎక్కువగా ఉంది.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌ తో నటించిన అందర్ని దాదాపుగా కవర్‌ చేశారు. కానీ కొద్దిమందిని మాత్రం మర్చిపోయారు. ఎన్టీఆర్‌తో నటించిన అంజలి - భానుమతి లాంటి వాళ్ల ప్రస్తావన లేదు. గుండమ్మకథ సినిమాలో సీన్‌ తీస్తూ.. సూర్యకాంతం పాత్ర ప్రస్తావనే తీసుకురాలేదు. అన్నింటికి మించి తెలుగు ఇండస్ట్రీ  హైదరాబాద్‌ షిఫ్ట్‌ అవ్వడానికి కారణం.. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి. ఈ సినిమాలో ఆయన పేరు కూడా ఎక్కడా రాలేదు. ఇక .. ఇందులో దానవీర శూర కర్ణ సినిమా టైమ్‌లో ఇప్పటివరకు మూడు పాత్రలు ఎవ్వరూ చేయలేదు అని అంటారు బాలయ్య. కానీ అప్పటికే నవరాత్రి సినిమాలో 9 పాత్రల్లో అద్భుతంగా నటించారు అక్కినేని. ఆ తర్వాత అదే సినిమాను తమిళ్‌లో శివాజీ గణేషన్‌ కూడా తీశారు.
Tags:    

Similar News