ఈ మధ్యకాలంలో అంటే ట్విట్టర్లో నుండి బయటకెళ్ళిపోయి.. వివాదాస్పద వ్యాఖ్యలు కాస్త తగ్గించాడేమో కాని.. అసలు ఫిలిం మేకర్ గా రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎటువంటి మ్యాజిక్ ను గత కొన్నేళ్ళగా చూపించలేకపోతున్నాడు. ఆ మధ్యన వచ్చిన సర్కార్ 3 సినిమాలో కూడా.. ఒక్కటంటే ఒక్కటి కూడా డైరక్టర్ టచ్ ఉన్న సీనే లేదు. అటువంటి వర్మకు ఇప్పుడు ఒక మెగా ఆఫర్ వచ్చిందా? వచ్చిందనే అంటున్నారు.
ఎన్నాళ్ళ నుండో లెజండరీ నటుడు.. రాజకీయ నాయకుడు.. కీ.శే. ఎన్టీఆర్ జీవితంపై ఒక సినిమా చేయాలనే టాపిక్ వినిపిస్తూనే ఉంది. అయితే ఈ ప్రాజెక్టును బాలయ్యను హీరోగా పెట్టి చేస్తే ఎలా ఉంటుందని ఎవ్వరూ ఆలోచించి ఉండరు. ఈ మధ్యనే రామ్ గోపాల్ వర్మకు.. ఎన్టీఆర్ 1.. ఎన్టీఆర్ 2 అంటూ రెండు భాగాలుగా ఎన్టీఆర్ జీవితగాధను తీయొచ్చనే సూపర్బ్ ఐడియా వచ్చిందట. వెంటనే పూరి జగన్ ద్వారా ఈ విషయాన్ని బాలయ్యకు చెప్పడంతో.. ఆయన కూడా ఓకె అన్నారని తెలుస్తోంది. ఈ సినిమాను సైమా అవార్డులను నిర్వహించినే విష్ణు ఇందూరి ప్రొడ్యూస్ చేయనున్నారని టాక్.
ఇకపోతే ఎన్టీఆర్ కథను ఎన్ని భాగాలుగా చెప్పినా చూడ్డానికి తెలుగు ప్రేక్షకులు రెడీయే. అలాగే ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటిస్తే అది ఇంకా యాప్ట్ గా కూడా ఉంటుంది. కాని వినూత్నంగా విడ్డూరంగా విచిత్రంగా ఉన్న విషయం ఏంటంటే.. రామ్ గోపాల్ వర్మ డైరక్ట్ చేయడం. కేవలం మర్డర్లను రక్తపాతాన్ని విపరీతంగా డ్రమటైజ్ చేసే రామ్ గోపాల్ వర్మ.. తెలుగువారు ఆరాధ్యభావంతో చూసే ఎన్టీఆర్ కథకు న్యాయం చేస్తాడా? చేయగలడా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు సినిమాలోకాన్ని తొలిచేస్తున్నాయ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/