బాలయ్యను ఇంకా విసిగిస్తూనే ఉన్నారా?
NBK106 .. విషయంలో అసలేం జరుగుతోంది? ఎన్నాళ్లు ఈ సస్పెన్స్! నటసింహ 106వ సినిమా మొదలైపోతోందోచ్! అంటూ ఓవైపు ప్రచారం ఊదరగొట్టేస్తున్నారు. కానీ లోన లోన అసలేం జరుగుతోందో అర్థంకాని సన్నివేశం నెలకొంది. అసలు ఏది నిజం? ఏది అబద్ధం? ఎవరినని నమ్మాలి?
బాలయ్య 106వ సినిమా కోసం దర్శకుడు బోయపాటి శ్రీను అన్నిరకాలుగా సన్నద్ధమయ్యారన్న ప్రచారం ఇప్పటికే సాగుతోంది. ఈ ఫిబ్రవరి నుంచి సినిమా మొదలువుతుందని ఇదివరకూ ప్రచారమైంది. బాలయ్య ఇమేజ్ కు సరిపడే స్క్రిప్టును బోయపాటి రెడీ చేశారని.. హీరోయిన్లు సహా టెక్నికల్ టీమ్ ని రెడీ చేయిస్తూ సర్వసన్నాహకాల్లో ఉన్నారని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కథనాలు వేడెక్కిస్తున్నాయి. హీరోయిన్ ని ఫైనల్ చేసే విషయంలోనే కాస్త డైలమా కొనసాగుతోంది... ఇప్పటికైతే స్క్రిప్ట్ లాక్ అయిందని ప్రచారమవుతోంది. వరుస పరాజయాల నుంచి గట్టెక్కించే సినిమా కోసం బాలయ్య అంతే ఆత్రంగా ఉన్నారన్న ప్రచారం ఉంది. ఈసారి ఆయన స్క్రిప్ట్ విషయంలో అన్ని రకాలా పక్కాగా జాగ్రత్తలతో ముందుకు వెళ్తున్నారని కథనాలు వచ్చాయి.
ఆషామాషి స్కిప్ట్ అయితే రావొద్దని... బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యే స్క్రిప్ట్ అయితేనే తనను అప్రోచ్ అవ్వమని అన్నారని వినిపించింది. దానికి తగ్గట్టుగానే బోయపాటి రీవర్క్ చేస్తున్నట్లు కథనాలు వచ్చాయి. ఇటీవలే మార్పుచేర్పులు చేసిన స్క్రిప్ట్ ని బాలయ్యకు వినిపించారు. అందుకే ఫిబ్రవరిలో మూహూర్తం సహా రెగ్యులర్ షూట్ ఫిక్స్ చేశారన్న ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారానికి పూర్తిగా చెక్ పెట్టేసేలా తాజాగా మరో ఆసక్తికర సంగతి తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందనేది ఇన్ సైడ్ టాక్. బంతి ఇంకా బాలయ్య కోర్టులొనే ఉంది.. బోయపాటికి పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయలేదు. బాలయ్య ఇంకా స్క్రిప్టును రివ్యూలు చేస్తున్నారని తెలుస్తోంది.
పక్కా స్క్రిప్టుతో వస్తేనే సినిమా చేద్దామని లేకపోతే లైట్ తీస్కోమని బోయపాటికి బాలయ్య ఖరాకండిగా చెప్పేసారన్న ప్రచారం మరోసారి వేడెక్కిస్తోంది. బోయపాటి ప్రస్తుతం స్క్రిప్టుపై రీవర్క్ చేస్తున్నారు. దీని విషయంలో అన్నిరకాలుగా జాగ్రత్త పడుతున్నారట. కారణం ఏదైనా బాలయ్య సహనాన్ని మాత్రం బోయపాటి అండ్ రైటర్ల టీమ్ పరీక్షిస్తూనే ఉన్నారని అర్థమవుతోంది. ఇన్ని నెలలు గా స్క్రిప్ట్ లాక్ చేయకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించేదే. సాధారణంగా బాలయ్య ను స్క్రిప్టు పరంగా ఈజీగా లాక్ చేయొచ్చని ఆయనతో పనిచేసిన దర్శకులు అంటుంటారు. అప్పట్లో పైసా వసూల్ స్క్రిప్టును బాలయ్య వినకుండానే పూరి జగన్నాథ్ కు ఒకే చెప్పేసారు. కేవలం దర్శకుడిపై తనకున్న నమ్మకంతోనే అలా చేసారు. ఈసారి స్క్రిప్టు చదివాక.. అంత నమ్మకం బోయపాటి మీద కలగడం లేదా? అందుకేనా ఈ వెయిటింగ్? అంటూ ఓ సెక్షన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.