బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ ముగింపు దశకు చేరుకుంది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంను నేడు నిమ్మకూరులో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంకు నందమూరి ఫ్యామిలీ మొత్తం కూడా జూనియర్ ఎన్టీఆర్ తో సహా హాజరు కాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కాకుండా టాలీవుడ్ కు చెందిన సీనియర్ హీరోలు మరియు ప్రముఖులు ఎంతో మందిని బాలయ్య ప్రత్యేకంగా ఆహ్వానించాడట.
కృష్ణ - కృష్ణంరాజు - మోహన్ బాబు వంటి ప్రముఖులను బాలయ్య స్వయంగా ఆహ్వానించినట్లుగా నందమూరి వర్గాల నుండి సమాచారం అందుతుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. గతంలో తన గౌతమిపుత్ర శాతకర్ణి మూవీకి చిరంజీవిని ఆహ్వానించిన బాలయ్య ఈసారి మాత్రం చిరంజీవిని పక్కకు పెట్టినట్లుగా చెప్పుకుంటున్నారు.
రాజకీయ కారణాల వల్లే చిరంజీవిని ఈ కార్యక్రమంకు ఆహ్వానించడం లేదని ఒక వర్గం వారు భావిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి పాత్ర ఉంటుందని మొదట ప్రచారం జరిగినా, ఆ పాత్రను బాలయ్య వద్దని దర్శకుడికి చెప్పడంతో తీసేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి చిరంజీవికి ఆహ్వానం అందలేదనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.