‘‘నీ హిస్టరీలో బ్లడ్డుందేమో.. నా బ్లడ్డుకే ఓ హిస్టరీ ఉంది’’ అంటూ దసరాకు ఓ రచ్చ టీజర్ వదిలాడు నందమూరి బాలకృష్ణ. సినిమా ఎలా ఉంటుందనే హింట్ ఇస్తూ.. సంక్రాంతికి సినిమా వస్తుందా రాదా అనే అనుమానాలను కూడా క్లియర్ చేస్తూ ‘2016 సంక్రాంతి విడుదల’ అన్న ట్యాగ్ కూడా తగిలించారు టీజర్ కి. దీంతో సంక్రాంతికి బాబాయి, అబ్బాయి పోటీ పడటం ఖాయమన్న అభిప్రాయానికి వచ్చేశారు నందమూరి అభిమానులు. కానీ ‘డిక్టేటర్’ సంక్రాంతికి డౌటే అని మళ్లీ అనుమానాలు కలుగుతున్నాయి.
సంక్రాంతి టార్గెట్ పెట్టుకుని డైరెక్టర్ శ్రీవాస్.. రెండు యూనిట్లతో షూటింగ్ చేస్తున్నప్పటికీ ఆ సమయానికి సినిమా పూర్తవడం కష్టమే అంటున్నారు యూనిట్ సభ్యులు. టాకీ పార్ట్ ఇంకా 40 శాతం దాకా బ్యాలెన్స్ ఉందని.. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయ్యేసరికి సంక్రాంతి డెడ్ లైన్ ను అందుకోవడం కష్టమని.. ఈ నేపథ్యంలో సినిమాను ఫిబ్రవరికి వాయిదా వేసుకోవడం బెటరని ఆలోచిస్తున్నారట. మరోవైపు అసలే బాబాయికి, అబ్బాయికి సంబంధాలు సరిగా లేవనే అభిప్రాయాలు జనాల్లో ఉన్నాయని.. అభిమానుల్లో ఇప్పటికే విభేదాలున్నాయని.. ఇక సంక్రాంతికి ఇద్దరూ పోటీ పడితే.. గొడవలు ముదురుతాయని.. ఇది నందమూరి ఫ్యామిలీకే చేటు చేస్తుందని.. కాబట్టి హడావుడి పడకుండా ‘డిక్టేటర్’ను వాయిదా వేయడం మంచిదని సలహాలు కూడా ఆ యూనిట్ సభ్యుల చెవిన పడుతున్నాయట. కాబట్టి ‘డిక్టేటర్’ ఫిబ్రవరికి వాయిదా పడితే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.