ఇప్పుడు అందరి చూపూ.. ఎప్పుడెప్పుడు బాలయ్య ''యోధుడు'' సినిమా గురించి ప్రకటన ఇచ్చేస్తాడా అనే. ఉగాది రోజున నందమూరి నటసింహం తన 100వ సినిమా గురించి ప్రత్యేకమైన ప్రకటన ఇస్తాడని ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే. అయితే అది క్రిష దర్శకత్వంలో అమరావతి రాజు గౌతమీపుత్ర శాతకర్ని గురించే అని ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిన విషయం కూడా తెలిసిందే. కాని ఇక్కడే ఒక సందేహం వస్తోంది.
రాజుల కాలం నాటి స్టోరీ అంటే.. ఖచ్చితంగా 'బాహుబలి' లెవెల్ లో సెట్లు వేయాలి.. స్టోరీ బోర్డులు తయారు చేసుకొని విజువల్ ఎఫెక్ట్స్ ప్లాన్ చేసుకోవాలి.. అంతే కాకుండా భారీ బడ్జెట్ తో నిష్ణాతులైన టెక్నీషియన్లను తీసుకొని.. ఎలాంటి ఔట్ పుట్ రాబట్టుకోవాలనేది ముందే ఒక అంచనాకు రావాలి. అందుకే బాహుబలి - రుద్రమదేవి వంటి సినిమాలకు కేవలం ప్రీ ప్రొడక్షన్ చేయడానికి ఏకంగా సంవత్సరం పైగా టైమ్ పట్టింది. మరి బాలయ్య సినిమాకు అవన్నీ జరిగేది ఎప్పుడు? షార్టు పిరియడ్ లో అవన్నీ చేయడానికి కుదురుతుందా?
ఒకవేళ ఏప్రియల్ 8న సినిమాను ప్రకటించినా కూడా.. షూటింగ్ కు వెళ్లడానికి కనీసం ఒక ఆరు నెలలు సమయం తీసుకుంటే కాని.. ఆ కింగ్ రేంజు లుక్ రాదు. అలా కాకుండా ఉత్తినే ఒక నెల రోజుల్లో షూటింగ్ మొదలెట్టేస్తే.. రేపు రిలీజయ్యాక.. బాహుబలి - రుద్రమదేవి - బాజీరావ్ మస్తానీ వంటి సినిమాలతో జనాలు చేసే కంపారిజన్ లు తట్టుకోవాల్సి ఉంటుంది మరి.