బాల‌య్య మాట‌ల‌పై చ‌ర్చ‌

Update: 2016-03-05 08:00 GMT
దాప‌రికం లేని వ్య‌క్తిత్వం బాల‌కృష్ణ‌ది. మ‌న‌సులో ఏదుంటే అది  బ‌య‌ట‌పెట్టేస్తుంటాడు. అభిమాల‌నుకి బాల‌కృష్ణ‌లో న‌చ్చే గుణం కూడా అదే. వేదిక ఎక్కితే బాల‌య్య ప్ర‌సంగానికి అడ్డు అదుపూ ఉండ‌దు. పురాణాల నుంచి ప్ర‌స్తుత ట్రెండ్ వ‌ర‌కు అన్నీ చెప్పేస్తుంటాడు. ఈ మ‌ధ్య‌లో ఆయ‌న స్టైల్ ఆఫ్ చెణుకులు కూడా వేస్తుంటాడు. స‌భికుల్ని న‌వ్వించేందుకే ఆ ప్ర‌య‌త్నమన్న‌మాట‌. అయితే కొన్నిసార్లు ఆ మాట‌లు సొసైటీలో హాట్ టాపిక్ అవుతుంటాయి. వివాదానికి దారితీస్తుంటాయి. తాజాగా మ‌రోసారి బాల‌య్య మాట‌లు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌ గా మారాయి. అమ్మాయికి ముద్ద‌యినా పెట్టాలి - క‌డుపైనా చేయాలి అన్న బాల‌య్య మాట‌లే అందుకు కార‌ణం.

నారా రోహిత్ కథానాయ‌కుడిగా నటించిన ‘సావిత్రి' మూవీ ఆడియో వేడుకలో బాలయ్య  పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సుదీర్ఘంగా ప్ర‌సంగించారు బాల‌య్య‌.  అందరూ అన్ని రకాల పాత్రలు చేయలేరు అన్న విష‌యాన్ని చెప్పేందుకు కొన్ని వ్యాఖ్య‌లు చేశారాయ‌న‌. ``నేను కొన్ని పాత్రలు మాత్రమే చేయగలను, అమ్మాయిల వెంట పడే పాత్రలు చేస్తే మా ఫ్యాన్స్ ఊరుకోరు. అమ్మాయికి ముద్దు అయినా పెట్టాలి... కడుపుపైనా చేయాలి, కమిట్ కమిట్ అంటూ వెళ్లి పోవాలి``  అంటూ చెప్పుకొచ్చారు. ఆ మాట‌లే ఇప్పుడు చ‌ర్చ‌ను లేవ‌నెత్తుతున్నాయి. ముద్దయినా పెట్టాలి, క‌డుపైనా చేయాలి అన్న మాట‌లేంటని కొద్దిమంది చ‌ర్చించుకొంటున్నారు. తెర‌పై క‌నిపించే పాత్ర‌ల శైలి గురించే బాల‌య్య అలాంటి కామెంట్లు చేశాడు త‌ప్ప‌, మహిళల్ని కించ‌ప‌రిచేలా మాత్రం కాద‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు.
Full View
Full View


Tags:    

Similar News