కూతురుతో బాలయ్య..అలనాటి ఫోటో

Update: 2016-12-23 17:52 GMT
నందమూరి బాలకృష్ణ.. వైవిధ్యభరితమైన చిత్రాలను తీయడానికి కేరాఫ్ అడ్రస్. పౌరాణికాలు.. జానపదాలు..చారిత్రకాలు.. సాంఘిక చిత్రాలు.. ఇలా ఏ సినిమా అయినా తీసేయగల సత్తా ఉన్న సీనియర్ హీరో బాలకృష్ణ. అప్పట్లో బాలయ్య తన సినిమా షూటింగ్స్ కి.. తన వారసులను కూడా అప్పడప్పడూ తీసుకెళుతూ ఉండేవారు.

తండ్రి బాలకృష్ణతో.. కూతురు బ్రాహ్మణి చిన్ననాటి ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అయిపోతోంది. ఈ ఫోటో చూస్తుంటే బాలయ్య చేసే ఓ జానపద చిత్రం అని అర్ధం అవుతోంది. నిజానికి ఇది అప్పట్లో బాలయ్య హీరోగా మొదలయ్యి.. కొంత షూటింగ్ జరిగాక ఆగిపోయిన చిత్రం. అప్పట్లో తండ్రి సినిమా షూటింగ్ చూసేందుకు కూతురు బ్రాహ్మణి కూడా షూటింగ్ స్పాట్ కి వచ్చినపుడు ఈ ఫోటో క్లిక్ మనిపించారు.

ఏపీ సీఎం చంద్రబాబు వారసుడు నారా లోకేష్ కు.. బ్రాహ్మణి ఇప్పుడు సతీమణి అనే సంగతి తెలిసిందే. మరోవైపు బాలయ్య కూడా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే. ఇప్పటి సంగతులు ఇలా ఉంటే.. అప్పట్లో తండ్రీ కూతుళ్లు షూటింగ్ స్పాట్ లో కబుర్లు చెప్పుకుంటున్న ఈ ఫోటో బలే చూడముచ్చటగా ఉంది కదూ.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News