సినిమాల్లోనూ 'అన్ స్టాపబుల్' గా బాలయ్య..!

Update: 2022-12-01 15:30 GMT
నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాల లైనప్ తో స్టార్ హీరోలకు షాక్ ఇస్తున్నారు. అఖండ హిట్ తో మళ్లీ తిరిగి మాస్ ఫాంలోకి వచ్చిన బాలకృష్ణ ప్రస్తుతం మరో మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో మూవీ చేస్తున్నారు. వీర సింహా రెడ్డి అంటూ వస్తున్న ఈ మూవీ బాలయ్య లోని వీర రసాన్ని.. పౌరుషాన్ని చూపించాలని ఫిక్స్ అయ్యారు. NBK107వ సినిమాగా వస్తున్న వీర సింహారెడ్డి బాక్సాఫీస్ పై తన సత్తా చాటాలని చూస్తున్నాడు. నందమూరి ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు సినిమాలో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని.

ఈ మూవీ తర్వాత అనీల్ రావిపుడితో మూవీ ఫిక్స్ చేసుకున్నారు బాలయ్య. ఎంటర్టైనింగ్ సినిమాలు తీస్తూ డైరెక్టర్ గా ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా సక్సెస్ ట్రాక్ ఉన్న అనీల్ రావిపుడి బాలకృష్ణతో క్రేజీ మూవీ చేస్తున్నారు.

అటు బాలయ్య మార్క్ మాస్ అంశాలు ఉంటూనే తన స్టైల్ కామెడీ కూడా ఉంటుందని అంటున్నారు అనీల్ రావిపుడి. NBK 108 వేరే లెవల్ అంటూ ఈమధ్య ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పడం హాట్ న్యూస్ గా మారింది. ఇక ఈ మూవీ తర్వాత మరోసారి బోయపాటితో బాలకృష్ణ మూవీ ఉంటుందని టాక్. అఖండ సీక్వల్ గా అఖండ 2ని తీసే ఆలోచనలో ఈ ఇద్దరు ఉన్నారు.  

వీరితో పాటుగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరక్టర్ ప్రశాంత్ వర్మ కూడా బాలకృష్ణతో సినిమాకు రెడీ అంటున్నాడు. బాలయ్య చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ ప్రోమోలన్ని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశారు. ఈ ప్రోమోస్ కు స్పెషల్ క్రేజ్ రావడంతో మంచి కథ ఉంటే ప్రశాంత్ వర్మతో చేసేందుకు రెడీ అని అంటున్నారట బాలయ్య. ఇక కళ్యాణ్ రామ్ తో బింబిసార మూవీ తీసిన వశిష్ట కూడా బాలయ్యతో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తుంది. బింబిసార మూవీ చూసి వశిష్టని మెచ్చుకున్న బాలయ్య అతనితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.      

వీరే కాదు ఈమధ్య ఊర్వశివో రాక్షసివో ఈవెంట్ లో బాలయ్యతో సినిమా చేయాలని తన మనసులోని కోరిక వెళ్లబుచ్చాడు కేరాఫ్ కంచెరపాలెం డైరక్టర్ వెంకటేష్ మహా. అతను కూడా బాలయ్య ఓకే అంటే కథ రెడీ చేసేందుకు ఫిక్స్ అయ్యాడు. దాదాపు వీరందరితో బాలకృష్ణ ప్రాజెక్ట్ లు కన్ఫర్మ్ చేసే ఛాన్స్ ఉంది. బాలయ్య దూకుడు చూస్తుంటే ఆయన చేస్తున్న టాక్ షో లానే ఆయన కూడా అన్ స్టాపబుల్ అనిపించేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News