బాలయ్య.. దానయ్య త్వరలో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Update: 2022-10-10 14:30 GMT
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్‌ అవుతున్నాడు. అఖండ సక్సెస్ జోష్ లో ఉన్న బాలయ్య ఇప్పటికే గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ఈ ఏడాది చివర్లో డిసెంబర్‌ లో అఖండ విడుదల అయినట్లుగా విడుదల అవ్వబోతున్నట్లుగా నందమూరి ఫ్యాన్స్ కు యూనిట్‌ సభ్యుల నుండి సమాచారం అందుతోందట.

ఇక బాలయ్య తదుపరి సినిమా కు కూడా దర్శకుడు ఫిక్స్ అయ్యాడు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య సినిమా రూపొందబోతుంది. అతి త్వరలోనే ఆ సినిమా కూడా పట్టాలెక్కబోతుంది అంటూ సమాచారం అందుతోంది. సినిమాకు సంబంధించిన చర్చ కార్యక్రమాలు జరిగాయి.. అతి త్వరలోనే స్క్రిప్ట్ వర్క్ ముగించి పట్టాలెక్కించే అవకాశం ఉంది.

బాలయ్య మరియు అనిల్‌ రావిపూడి కాంబో సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే సన్నాహాలు చేస్తున్నారు. ఇదే సమయంలో డివివి దానయ్య కి కూడా బాలయ్య డేట్లు ఇచ్చాడనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా తర్వాత దానయ్య నిర్మించబోతున్న సినిమా ఇదే అవ్వడం విశేషం.

వీరిద్దరి కాంబో సినిమాకు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆహా ఓటీటీ కోసం చేసిన అన్ స్టాపబుల్‌ టాక్ షో ప్రోమో ను బాలయ్య పై ప్రశాంత్‌ వర్మ చిత్రీకరించిన విషయం తెల్సిందే.

రెండు సీజన్ ల యొక్క ప్రోమోల విషయంలో చాలా పాజిటివ్ టాక్‌ వచ్చింది. అంతే కాకుండా విభిన్నమైన దర్శకుడిగా కూడా ప్రశాంత్‌ వర్మకి పేరు వచ్చింది. అందుకే బాలయ్య మరియు ప్రశాంత్‌ వర్మల కాంబోలో సినిమా రాబోతుందని.. అది కూడా ఆర్ ఆర్ ఆర్‌ చిత్ర నిర్మాత దానయ్య నిర్మాణంలో అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇటీవల దానయ్య రాజా డీలక్స్ సినిమా నిర్మాణం నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు బాలయ్య సినిమా నిర్మాణం విషయంలో అతి త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. టాలీవుడ్‌ తో పాటు ఇతర భాషల్లో కూడా ఆకట్టుకునే విధంగా ప్రశాంత్‌ వర్మ మరియు బాలయ్య కాంబో సినిమా ఉంటుందని అప్పుడే ప్రచారం మొదలు అయ్యింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News