బాలయ్య బాబుని ఇలా ఎప్పుడైనా చూశారా?

Update: 2022-07-25 06:03 GMT
నందమూరి బాలకృష్ణ హీరోగా అఖండ తో భారీ విజయాన్ని సొంతం చేసుకుని వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ప్రస్తుతం బాలయ్య సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా లో బాలయ్య రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నాడు. ఆ గెటప్స్ ఇప్పటికే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది.

హీరోగా బాలయ్య జోరుకు యంగ్‌ హీరోలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. బాలయ్య గెటప్.. ఆయన డైలాగ్‌ డెలవరీకి అంతా ఫిదా అవుతున్నారు. తాజాగా బాలయ్య విమానాశ్రయంలో కెమెరా ల కంట పడ్డారు. బాలయ్య ను ఒక్కసారిగా ఇరవై ఏళ్ల వయసు తక్కువ అయినట్లుగా చూసినట్లు ఉందంటూ జనాలు చర్చించుకుంటున్నారు.

బాలయ్య బాబును ఇలా ఎప్పుడు కూడా చూడలేదు అంటూ అభిమానులు కొందరు సోషల్‌ మీడియాలో ఈ ఫోటోలను తెగ షేర్‌ చేస్తూ ఉన్నారు. మరో వైపు బాలయ్య ఫోటోలతో ఇలా మీరు ఎప్పుడైనా బాలయ్య ను చూశారా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. మొత్తానికి బాలయ్య బాబు సోషల్ మీడియాలో ఈ ఫోటోతో హడావుడి చేస్తూ ట్రెండ్‌ అవుతున్నాడు.

బాలయ్య లుక్ కు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. బాలయ్య ను ఇంత యంగ్ గా చేసిన మేకప్‌ ఆర్టిస్ట్ కు మరియు ఆయన కాస్ట్యూమ్‌ డిజైనర్ కు హ్యాట్సాఫ్ అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలయ్య తాజా సినిమా షూటింగ్ విషయానికి వస్తే గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చివరి దశకు వచ్చింది.

మరో వైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా ను చేసేందుకు ఇప్పటికే డేట్లు ఇచ్చాడు. ఈ ఏడాది చివర్లోనే సినిమా ను ప్రారంభం చేసే అవకాశం ఉంది. బాలయ్య.. అనిల్ రావిపూడి కాంబో సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ కాంబో ను నిర్మించబోతున్న నిర్మాత ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
Tags:    

Similar News