నటసింహం నందమూరి బాలకృష్ణ దర్శకుల హీరో అని అంటుంటారు. ఒక్కసారి కథ ఫైనల్ చేసిన తర్వాత మళ్ళీ అందులో జోక్యం చేసుకోవడం వంటివి ఉండవు. అందుకే ఆయనతో కలిసి సినిమా చేయడానికి అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. కథ నచ్చితే బాలయ్య యంగ్ డైరెక్టర్స్ తో.. కొత్త దర్శకులతో వర్క్ చేయడానికి కూడా వెనకాడరు. అయితే ఎందుకనో గత కొంతకాలంగా అగ్ర హీరో సీనియర్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు.
వరుస ప్లాప్స్ తో సతమతమైన బాలకృష్ణ.. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో కలిసి ''అఖండ'' వంటి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇదే జోష్ లో ప్రస్తుతం క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ''వీర సింహారెడ్డి'' అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. దీని తర్వాత బాలయ్య బ్లాక్ బస్టర్ అనిల్ రావిపూడి తో జట్టు కట్టబోతున్నారు. త్వరలోనే NBK108 ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే దీని తర్వాత నటసింహం సినిమా ఏంటనే దానిపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
'ఊర్వశివో రాక్షసివో' ప్రీ రిలీజ్ వేడుక వేదికగా ఇద్దరు దర్శకులు బాలకృష్ణతో వర్క్ చేయాలనే తమ ఆశను వెలిబుచ్చారు. 'గీత గోవిందం' 'సర్కారు వారి పాట' చిత్రాల దర్శకుడు పరశురామ్ పెట్లా.. త్వరలోనే బాలయ్యను కలిసి ఓ కథ చెప్పనున్నట్లు తెలిపారు. కథ నచ్చితే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. అలానే 'కేరాఫ్ కంచరపాలెం' 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు వెంకటేష్ మహా కూడా సీనియర్ హీరోతో సినిమా చేయడానికి రెడీ అని తన మనసులో మాట చెప్పేసాడు.
మాస్ మసాలా ఎంటర్టైనర్లకు పెట్టింది పేరైన బాలయ్య.. వెంకటేష్ మహా వంటి ఈ జెనరేష్ డైరెక్టర్ తో సినిమా చేయడం సాధ్యమేనా అనే కామెంట్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ కాంబో వర్కవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. త్వరలోనే బాలకృష్ణ కు వెంకటేష్ స్క్రిప్ట్ నేరేట్ చేయడానికి రెడీ అవుతున్నాడని.. ఓకె అయితే వారాహి చలనచిత్రం బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి.
వెంకటేష్ మహా ఇప్పటికే బాలయ్య కోసం ఓ కథ రాసుకున్నారని.. అదొక సైకలాజికల్ డ్రామా అని.. అందులో డార్క్ కామెడీ కూడా ఉంటుందని రూమర్స్ ఉన్నాయి. ఇప్పటి వరకూ బాలకృష్ణ చేసిన సినిమాలకు భిన్నంగా.. రియలిస్టిక్ కు దగ్గరగా ఉంటుందని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. వెంకటేష్ వంటి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తో వర్క్ చేస్తే కచ్చితంగా అది బాలకృష్ణకు వైవిధ్యమైన సినిమా అవుతుందని చెప్పొచ్చు. మరి త్వరలోనే ఈ కాంబో సెట్ అవుతుందేమో చూడాలి.
ఇకపోతే 'సింహా' 'లెజెండ్' 'అఖండ' వంటి హ్యాట్రిక్ ఘన విజయాలు అందుకున్న బాలయ్య - బోయపాటి.. మళ్ళీ ఓ సినిమా చేసే అవకాశం ఉందనే టాక్ ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలెక్షన్స్ కు ముందు ఈ క్రేజీ కాంబోలో సినిమా ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం బాలకృష్ణ ఓవైపు ఆహా ఓటీటీ కోసం 'అన్ స్టాపబుల్' టాక్ షో చేస్తూనే.. మరోవైపు 'వీర సింహారెడ్డి' సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా 2023 సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ కానుంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ - దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఎస్ థమన్ స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.