నటుడిగా నాగ మహేశ్ చాలాకాలంగా .. చాలా దూరం ప్రయాణించాడు. ఈ మధ్య కాలంలోనే ఆయనకి కాస్త మంచి గుర్తింపు ఉన్న పాత్రలు పడుతూ వస్తున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'బంగార్రాజు' సినిమాలో నేను చాలా మంచి రోల్ చేశాను. అయితే నాగార్జున .. నాగచైతన్య కాంబినేషన్లో నా సీన్స్ ఉండవు. సంపత్ రాజు .. రావు రమేశ్ కాంబినేషన్లో నా పాత్ర కనిపిస్తుంది. నాగార్జునగారు చాలా స్లిమ్ గా ఉన్నారు. ఆయన .. చైతూ ఇద్దరూ కూడా అన్నదమ్ముల్లా కనిపించారు. గతంలో నేను నాగార్జునగారితో మూడు సినిమాలు చేశాను.
అదే విషయాన్ని నాగార్జునగారితో చెబితే .. 'ఏ సినిమాలు చేశారండీ' అన్నారాయన. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం .. రక్షణ .. వారసుడి సినిమాలు చేసినట్టు చెప్పాను. అలాగే చైతూతో 'లవ్ స్టోరీ' చేశాను అని చెప్పాను. అప్పుడు ఆయన నన్ను గుర్తుపట్టేసి, ఆ సినిమాలో నేను చేసిన సీన్స్ ను గుర్తుచేశారు. చాలా బాగా చేశారండీ అంటూ మెచ్చుకున్నారు. 'బంగార్రాజు' షూటింగు హైదరాబాద్ .. రాజమండ్రి .. మైసూర్ లలో జరిగింది. చాలా సరదాగా .. సందడిగా షూటింగు జరిగేది. ఈ సినిమా చేయడమనేది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
బాలయ్యగారితో 'అఖండ' చేశాను .. ఆయన తనంతట తానే పలకరిస్తారు. నాగార్జున గారిని పలకరిస్తేనే మాట్లాడతారు. బాలకృష్ణగారు షూటింగు సమయంలోను .. విరామ సమయంలోను కలుపుకుని మాట్లాడుతూనే ఉంటారు. 'లవ్ స్టోరీ' సినిమా సమయంలో చైతూను చాలా దగ్గరగా గమనించాను. ఆయన చాలా సింపుల్ గా .. రిజర్వడ్ గా ఉంటారు. నాగార్జునలానే ఉంటారు .. కాకపోతే నాగార్జున గారు కాస్త యాక్టివ్ గా ఉంటారు .. చైతూ కాస్త సీరియస్ గా కనిపిస్తారు అంతే. 'బంగార్రాజు' షూటింగులో ఆయన నన్ను గుర్తుపట్టారు .. నవ్వుతూ పలకరించారు.
ఇంతవరకూ చిరంజీవి .. బాలకృష్ణ .. నాగార్జున గార్లతో చేసే అవకాశం వచ్చింది. ఇంకా వెంకటేశ్ గారితో చేయలేదు. అలాంటి అవకాశం కోసమే వెయిట్ చేస్తున్నాను. 'అఖండ' వలన నాకు మంచి గుర్తింపు వచ్చింది .. దర్శక నిర్మాతలకు నాపై నమ్మకం పెరిగింది. అందువలన వెంకటేశ్ గారి సినిమాలోను చేసే ఛాన్స్ వస్తుందని భావిస్తున్నాను. స్టార్ హీరోలతో కలిసి పనిచేయడం వలన చాలా విషయాలను నేర్చుకున్నాను. సీన్ బాగా రావడం కోసం వాళ్లు ఎంతలా కష్టపడతారనేది చూశాను. ప్రస్తుతం ఎలాంటి పాత్ర ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను" అని చెప్పుకొచ్చాడు.