#MB27.. కీర్తి ఆఫ‌ర్ కియ‌రా కొట్టేసిందా?

Update: 2020-04-01 04:01 GMT
హీరోయిన్ ఎంపిక లో ద‌ర్శ‌కుల‌కు హీరో సింక‌వ్వాలి. కొంద‌రు హీరోలైతే త‌మ‌కు న‌చ్చిన హీరోయిన్ నే తీసుకోవాల‌ని డైరెక్ట‌ర్ల‌పై ఒత్తిడి తెస్తుంటారు. హీరో ఇమేజ్ పై సినిమా ఆడుతుంది కాబ‌ట్టి చాలా వ‌ర‌కూ ద‌ర్శ‌కులు కాద‌న‌లేరు. నాయిక‌ ఎంపిక‌లో హీరో చెప్పిన‌ట్లు డైరెక్ట‌ర్ చేయాల్సిందే. అయితే ఇది అంద‌రు ద‌ర్శ‌కుల విష‌యంలో అలా ఉండ‌దు. డైరెక్ట‌ర్ స్థాయిని బ‌ట్టి డిసైడ్ అవుతుంది. తాజాగా టాలీవుడ్ బ్యాన్ గాళ్‌ కియారా అద్వానీని  సూప‌ర్ స్టార్ మ‌హేష్ రిక‌మండ్ చేస్తున్న‌ట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. మ‌హేష్ 27వ చిత్రానికి గీత‌గోవిందం ఫేం ప‌ర‌శురాం  ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం ఎంబీ 27 ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు సాగుతున్నాయి. రాష్ట్రంలో క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ప్రాజెక్ట్ సెట్స్ కు వెళ్ల‌డం ఆల‌స్య‌మ‌వుతోంది. లేదంటే ఇప్ప‌టికే అన్ని ప‌నులు పూర్తి చేసి ప‌ట్టాలెక్కేయాల్సి ఉండేది. ఇప్ప‌టికి జూన్ ముహూర్తం అన్న టాక్ అయితే వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో గ్యాప్ రావ‌డంతో ప‌ర‌శురాం కూల్ గా న‌టీన‌టులు..సాంకేతిక నిపుణుల ఎంపిక ప‌నుల్లో ఉన్నాడు. ఇప్ప‌టికే మ‌హేష్ కు జంట‌గా కీర్తి సురేష్ ని తీసుకుంటున్న‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అయితే ఇదేదీ అధికారికం కాదు. ఈలోగానే కియారా అద్వాణీ పేరు కూడా తెర‌పైకి వ‌చ్చింది.

`భ‌ర‌త్ అనే నేను` చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కియ‌రా అటుపై విన‌య విధేయ రామ ఫ్లాప‌వ్వ‌డంతో అటుపై టాలీవుడ్ వైపు చూడ‌నే లేదు. ప్ర‌స్తుతం హిందీ చిత్ర‌సీమ‌లో బిజీ నాయిక‌గా కొన‌సాగుతోంది. ఇక తెలుగు వ‌ర‌కూ.. దూర‌మైపోయింది. ఒక ర‌కంగా త‌న‌ను తాను బ్యాన్ చేసుకుని దూర‌మైపోవ‌డంతో బ్యాన్ గాళ్ అన్న‌ ముద్ర ప‌డిపోయింది. అయితే అన్నిటికీ చెక్ పెడుతూ.. మ‌రోసారి మ‌హేష్ త‌న స‌ర‌స‌న కియారాకి ఛాన్సిస్తున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఎంబీ 27 కోసం ప‌రశురామ్ కి కియ‌రాను రిక‌మండ్ చేసిన‌ట్లు ఓ ప్ర‌చారం సాగుతోంది. అదే నిజ‌మైతే హీరోగారి మాట‌ను డైరెక్ట‌ర్ కాద‌నే ఛాన్సే లేదు. అదేశాల్ని తూచ త‌ప్ప‌కుండా పాటించాల్సిందే. ఆ ర‌కంగా కియ‌రా జాక్ పాట్ కొట్టేసిన‌ట్టే.
Tags:    

Similar News