చెక్ బౌన్స్ కేసులో నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ కు 6 నెలల జైలు శిక్ష విధించారన్న వార్త కొద్ది నెలల క్రితం టాలీవుడ్ లో కలకలం రేపింది. `టెంపర్` సినిమాకు సంబంధించిన చెల్లని చెక్ కేసులో గణేష్ కు హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కోర్టు ....6 నెలల జైలు శిక్ష, 15లక్షల 86వేల 550 రూపాయల జరిమానా విధించింది. రూ. 25 లక్షలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు ఈ శిక్ష పడింది. టెంపర్ చిత్ర కథా రచయిత వక్కంతం వంశీ....గణేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీర్పు వెలువడిన తర్వాత బండ్ల గణేష్ అప్పీల్ చేసుకోవడంతో న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తనపై వంశీ తప్పుడు కేసు పెట్టారని గణేష్ ఆరోపించారు. ఈ విషయంపై మా అసోసియేషన్ తో చర్చిస్తానని కూడా చెప్పారు. ఆ వివాదం ఇంకా సద్దుమణగకముందే తాజాగా, బండ్ల గణేష్ పై మరోసారి చెక్ బౌన్స్ ఆరోపణలు వచ్చాయి.
తమకు బండ్ల గణేష్ ఇచ్చిన చెక్ లు బౌన్స్ అయ్యాయని ప్రొద్దుటూరులోని కొంతమంది వ్యక్తులు స్థానిక కోర్టును ఆశ్రయించారు. వారిచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన కోర్టు శుక్రవారం బండ్ల గణేష్ ను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం శుక్రవారం నాడు ప్రొద్దుటూరు కోర్టుకు హాజరైన బండ్ల గణేష్ ను విచారణ జరిపిన కోర్టు ...ఆ కేసును అక్టోబరు 9కి వాయిదా వేసింది. వంశీ వివాదం పూర్తిగా సద్దుమణగక ముందే గణేష్ మరో వివాదంలో చిక్కుకోవడం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు బండ్ల గణేష్ తెలుగులో 8 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 2015 లో వచ్చిన టెంపర్ గణేష్ చివరగా నిర్మించిన చిత్రం.