బండ్ల‌న్న‌కు అక్క‌డ‌ ఓట‌మి.. గెలిచిన కృష్ణ సోద‌రుడు!

Update: 2022-09-26 11:33 GMT
టాలీవుడ్ లో ఏ ఎన్నిక‌లు జ‌రిగినా ర‌స‌వ‌త్త‌ర పోటీ మాత్రం క‌న్ఫర్మ్ గా వుంటోంది. 'మా' ఎల‌క్ష‌న్స్ గురించి అయితే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిందే. సాధార‌ణ ఎన్నిక‌ల త‌ర‌హాలో అభ్య‌ర్థుల మ‌ధ్య హోరా హోరీ పోరు అంత‌కు మించిన కామెంట్ లు స‌ర్వ‌సాధార‌ణంగా మారిన విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి చెందిన మ‌రో ఎన్నిక‌లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అవే ఫిల్మ్ న‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ ఎన్నిక‌లు. గ‌త కొంత కాలంగా ఈ ఎన్నిక‌లు చాలా సైలెంట్ గా జ‌రుగుతున్నాయి.

అయితే ఈ సారి వార్త‌ల్లో నిలిచాయి. ఈ ఎన్నిక‌ల్లో ఫిల్మ్ న‌గ‌ర్ క‌ల్య‌ర‌ల్ సెంట‌ర్ అధ్య‌క్షుడిగా మాజీ అధ్య‌క్షుడు, సూప‌ర్ స్టార్ కృష్ణ సోద‌రుడు జి. ఆదిశేష‌గ‌రిరావు పోటీచేశారు. అల్లు అర‌వింద్‌, కె.ఎల్. నారాయ‌ణ‌, డి. సురేష్ బాబు మ‌ద్ద‌తుతో ఆయ‌న బ‌రిలో నిలిచారు.

హోరా హోరీగా సాగిన ఈ పోటీలో అధ్య‌క్షుడిగా జి. అదిశేష‌గిరిరావు విజ‌యం సాధించారు. అయితే ఉపాధ్య‌క్షుడిగా బ‌రిలోకి దిగిన బండ్ల గ‌ణేస్ ఓట‌మి పాల‌య్యాడు.

బండ్ల గ‌ణేష్ పై తుమ్మ‌ల రంగారావు ఉపాధ్య‌క్షుడిగా విజ‌యం సాథించారు. ఆదివారం ఉద‌యం నుంచే హోరా హోరీ గా ప్రారంభ‌మైన ఈ ఎన్నిక‌లు సాయంత్రానికి పూర్త‌య్యాయి. ఓట్ల లెక్కింపు త‌రువాత ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి చౌద‌రి గెలిచిన వారి పేర్ల‌ని అధికారికంగా ప్ర‌క‌టించారు. 'మా' ఎన్నిక‌ల త‌ర‌హాలోనే రెండేళ్ల‌కు ఒక‌సారి ఫిల్మ్ న‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారు. ఇందులో మొత్తం 4,600 మంది స‌భ్యులు వుండ‌గా అందులో 1900 మందికి మాత్ర‌మే ఓటు హ‌క్కు వుంది.

ఆదివారం జ‌రిగిన ఎన్నిక‌ల్లో అల్లు అర‌వింద్‌, కె.ఎల్. నారాయ‌ణ‌, డి. సురేష్ బాబు మ‌ద్ద‌తు తెలిపిన ప్యానెల్ స‌భ్యులు విజ‌యం సాధించారు. ముళ్ల‌పూడి మోహ‌న్ సెక్ర‌ట‌రీగా, తుమ్మ‌ల రంగారావు వైస్ ప్రెసిడెంట్ గా, రాజ‌శేఖ‌ర‌రెడ్డి ట్రెజ‌ర‌ర్‌గా, వీవీఎస్ ఎస్ పెద్దిరాజు జాయింట్ సెక్ర‌ట‌రీగా ఎన్నిక‌య్యారు. క‌మిటీ మెంబ‌ర్స్ గా ఏడిద రాజా, ఇంద్ర‌పాల్ రెడ్డి, మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల‌, సీహెచ్ వ‌ర‌ప్ర‌సాద‌రావు, శైల‌జ జూజాల‌, కాజా సూర్య‌నారాయ‌ణ‌, ద‌ర్శ‌కుడు ముర‌ళీమోహ‌న్ రావు, బాల‌రాజు, గోపాల‌రావు ఎంపిక‌య్యారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News