బండ్ల గణేష్.. ఒక ప్రముఖ యుట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూ ఇప్పుడు సంచలనాలకు కేంద్ర బింధువుగా మారింది. ఎందుకంటే ఈ ఇంటర్యూలో మనోడు రచ్చ లేపేశాడు. తనకు నచ్చిన దర్శకుల గురించి.. నచ్చని దర్శకుల గురించి తెగ చెప్పాడు. అయితే ఒక డైరక్టర్ తనకు నచ్చలేదు అంటూ మనోడు చేసిన కామెంట్లు సెన్సేషనల్ అయిపోయాయ్.
''నాకు దర్శకుడు పూరి జగన్ అంటే చాలా ఇష్టం. ఆయనకు సినిమాలంటే ప్యాషన్. ఒకసారి కథ లాక్ అయ్యాక ఒక రేంజు స్పీడులో సినిమాను తీసేస్తాడు. నిర్మాతలకు అలాంటి దర్శకులే కావాలి. హిట్టా ఫ్లాపా అనేది పక్కనెట్టేస్తే.. అలా టైముకు పని ఫినిష్ చేస్తే డబ్బులు వేస్ట్ అవ్వవు. అలాగే హరీశ్ శంకర్.. శ్రీను వైట్లలో.. నాకు చాలా తపన కనిపిస్తుంది. వారు ఎప్పుడూ సినిమా కోసం ఏదో చేయాలి అనే ఆలోచిస్తుంటారు. దర్శకుడు పరశురామ్ కూడా సినిమా అంటే చాలా ప్రేమించే వ్యక్తి'' అంటూ తాను పనిచేసిన దర్శకుల గురించి పాజిటివ్ గా చెప్పాడు గణేష్.
ఇక ఒక దర్శకుడి గురించి చెబుతూ.. ''అతనికి చాలా పేరుంటే ఉండొచ్చు. కాని రాత్రయితే మందు కొట్టడం.. డ్రగ్స్ తీసుకోవడం. ఛీ ఛీ. సినిమా అంటే నాలుగు ఇంగ్లీష్ సినిమాలు చూసి నాలుగు ఫ్రేములు పెట్టేస్తే కాదు. ఒక మంచి బ్లాక్ పెడితే సినిమా అయిపోదు. అతను ఏం కథ చెబుతాడో అతనికే తెలియదు. చెప్పింది గుర్తుండదు. ఏదో తీస్తుంటాడు. రోజులు తరబడి అలా సినిమాలు తీస్తే ఎలా? ఎప్పుడో పేరొచ్చేసిందని ఇప్పుడు ఆడుకోవడం తగదు. అలాంటివాళ్ళకు దేవుడు కూడా హిట్టివ్వడు'' అంటూ ఘాటుగా కామెంట్ చేశాడు.
ఇంతకీ మనోడు ఆ రేంజులో ఏకేసింది ఏ దర్శకుడ్ని అంటారు. మొత్తం ఇంటర్యూ చూసినోళ్లకు మాత్రం.. మనోడు ఈ మధ్యన తను పనిచేసిన ఒక డైరక్టర్ ను టార్గెట్ చేశాడని అర్దంచేసుకోవచ్చు. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/