కింగ్ అక్కినేని నాగార్జున - యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ''బంగార్రాజు''. సోగ్గాడు మళ్ళీ వచ్చాడు అనేది దీనికి ఉపశీర్షిక. ఇది ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు సీక్వెల్. ఐదేళ్ల క్రితం బంగార్రాజుగా సందడి చేసిన నాగ్.. ఈసారి తనయుడు చైతూ తో కలిసి సినీ ప్రియుల్ని అలరించడానికి వస్తున్నారు. కల్యాణ్ కృష్ణ కురసాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
'బంగార్రాజు' సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఆగస్ట్ నెలలో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లిన చిత్ర బృందం.. జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుతున్నారు. ఇప్పటికే 65 - 70 శాతం సినిమా కంప్లీట్ అవ్వగా.. తదుపరి షెడ్యూల్ కోసం టీమ్ అంతా ఇప్పుడు మైసూర్ లో ల్యాండ్ అయ్యారు. స్పెషల్ ఫైట్ దగ్గర నాగార్జున - కల్యాణ్ కృష్ణ తో సిబ్బంది దిగిన ఫోటో నెట్టింట సందడి చేస్తోంది.
మంగళవారం నుంచి 'బంగార్రాజు' మైసూర్ షెడ్యూల్ షూట్ ప్రారంభం కానుంది. ఇందులో ప్రధాన తారాగణం పాల్గొనే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. నాగార్జున స్పీడ్ చూస్తుంటే వచ్చే నెలాఖరుకు సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసి.. 2022 సంక్రాంతి బరిలో నిలుపుతారేమో అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సంక్రాంతి పండక్కి విడుదలైన 'సోగ్గాడే చిన్ని నాయనా' బ్లాక్ బస్టర్ అవడంతో.. సెంటిమెంటుగా దాని సీక్వెల్ ''బంగార్రాజు'' చిత్రాన్ని కూడా అదే సీజన్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 'ఆర్.ఆర్.ఆర్' 'రాధే శ్యామ్' సినిమాలు మాత్రమే ఫెస్టివల్ రేసులో మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అదనుగా నాగార్జున రంగంలోకి దిగుతారని అంటున్నారు.
ఇప్పటికే అక్కినేని సోగ్గాళ్ళు 'బంగార్రాజు' ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. సినిమాలోని ‘‘లడ్డుండా..’’ అనే ఫస్ట్ సింగిల్ ని మంగళవారం (నవంబర్ 9) ఉదయం 9:09 గంటలకు విడుదల చేయనున్నారు. ఇదంతా చూస్తుంటే ఛాన్స్ దొరికితే సంక్రాంతి వార్ లో నాగార్జున - నాగచైతన్య కలిసి దిగాలని చూస్తున్నారని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.
కాగా, 'బంగార్రాజు' చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ.. నాగచైతన్య కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇది కుటుంబమంతా కలిసి చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. 'మనం' తర్వాత నాగ్ - చై కలిసి నటిస్తున్న 'బంగార్రాజు' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.