మన సినిమాల్లో సైన్స్ ఫిక్షన్ అండ్ లవ్ స్టోరీలను కలిపి పెద్దగా కథలేం కనిపించవు. అయితే హాలీవుడ్ లో వచ్చిన కొన్ని సినిమాలను బేస్ చేసుకుని.. వాటన్నింటినీ కలిపి వండటంలో మనోళ్ళు సిద్దహస్తులు. అదిగో ఇప్పుడు కత్రినా కైఫ్ కొత్త సినిమా ''బార్ బార్ దేఖో'' చూస్తుంటే అదే అనిపిస్తుంది. సిద్దార్ద్ మల్హోత్రా హీరోగా.. నిత్యా మెహ్రా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.
ఈ ట్రైలర్లో మనకు అర్ధమయ్యేవి రెండు విషయాలు. ఒకటి.. కత్రినా తన కత్తిలాంటి అందాలను ఏ మాత్రం మొహమాటం లేకుండా ఆరబోసిందని. రెండోది ఈ సినిమాలో టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్టు ఉందని. మొన్న మన దగ్గర వచ్చిన ''24'' సినిమాను టుమారోల్యాండ్ అనే ఇంగ్లీష్ మూవీ చూసి ఇన్ స్పయిర్ అయితే.. ఈ ''బార్ బార్ దేఖో'' వారు మాత్రం ఆ సినిమాతో పాటు.. టామ్ క్రూజ్ ''ఎడ్జ్ ఆఫ్ టుమారో'' సినిమా తరహా ఐడియాలను జోడించి.. ఈ సినిమాను తీశారు. మరికొన్ని టైమ్ ట్రావెలింగ్ సినిమాల టచ్ కూడా మనకు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుందిలే. ఏమాటకు ఆ మాట చెబితే.. ప్రొడక్షన్ వ్యాల్యుస్.. కత్రినా అందాలు.. లుక్ అండ్ ఫీల్.. వావ్ సూపర్ అనిపించక మానవులే.
ఇకపోతే బ్రేకప్ అయ్యాక ఆ ఎమోషనల్ ప్రెజర్ ఎలా హ్యాండిల్ చేశావ్ అంటే.. ఏముంది రోజూ జిమ్ముకి వెళ్ళి కంటిన్యూస్ గా క్రంచెస్ చేశానంతే.. అంటోంది కత్రినా కైఫ్. సెప్టెంబర్ 9న ఈమె కొత్త సినిమా విడుదలవుతోంది.
ట్రైలర్ కోసం క్లిక్ చేయండి