లేటు వయసులో సీనియర్ తారల ప్రేమ పెళ్లి సరాగాలు
ఇక్కడ పిక్చర్ లో కనిపిస్తున్న జంటను చూడగానే ముచ్చటేస్తోంది కదూ!
మనసుండాలే కానీ వయసుతో పనేంటి? ఇలా ప్రశ్నించే తారలకు కొదవేమీ లేదు. లేటు వయసులోను పెళ్లితో పరిపూర్ణతకు దారి వెతికేవారున్నారు. ఇక్కడ పిక్చర్ లో కనిపిస్తున్న జంటను చూడగానే ముచ్చటేస్తోంది కదూ!
కాస్త లేటు వయసే కానీ, ఎంతో ముచ్చటగా కనిపిస్తున్నారు. ఈడు జోడు బాగా కుదిరింది. మలయాళం టీవీ నటులు క్రిస్ వేణుగోపాల్ - దివ్య శ్రీధర్ గురువాయూర్ ఆలయంలో జరిగిన ప్రైవేట్ వేడుకలో అధికారికంగా వివాహం చేసుకున్నారు. కుటుంబం సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఈ జంట పెళ్లి ప్రమాణాలు చేసారు.
క్రిస్ వేణుగోపాల్ బుల్లితెర పరిశ్రమలో సుపరిచితమైన పేరు. అతడు జనాదరణ పొందిన సీరియల్స్‌లో నటించడమే కాకుండా రచయిత, వాయిస్ ఆర్టిస్ట్ కూడా. దివ్య శ్రీధర్ కూడా టీవీ రంగంలో ప్రతిభావంతులైన నటి, వివిధ టెలివిజన్ ప్రాజెక్ట్‌లలో తన పాత్రలతో మెప్పించారు. ఆమె ముఖ్యంగా నెగిటివ్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్‌లో ఆకర్షణీయమైన నటనతో పాపులరయ్యారు. సీరియల్ వీక్షకులకు ఆమె సుపరిచితమైన ముఖం. ఇద్దరు నటులు ప్రముఖ సీరియల్ `పాతరమట్టు`లో కలిసి పని చేస్తున్నప్పుడు మొదటిసారి కలుసుకున్నారు. ఈ సీరియల్ లో వారు ప్రధాన పాత్రలను పోషించారు. అనంతమూర్తిగా క్రిష్ నటిస్తుండగా, నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో దివ్య నటిస్తోంది. దివ్య కు ఇది రెండో వివాహం. ఆమెకు మునుపటి వివాహం నుండి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండో పెళ్లితో ముందుకు వెళ్లే ముందు పిల్లలతో తన నిర్ణయాన్ని చర్చించడానికి ఆమె కొంత సమయాన్ని వెచ్చించింది.
వివాహం వ్యక్తిగతమైనది.. అర్ధవంతమైన జీవితం కోసం జంట కోరికను ప్రతిబింబించే ఒక సన్నిహిత వ్యవహారం. క్రిస్ - దివ్య ఇద్దరూ అభిమానులు, వినోద పరిశ్రమలోని సహోద్యోగుల నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు అందుకున్నారు. వారికి ప్రత్యేక శుభాకాంక్షలు.