హిందూ-ముస్లిమ్ ప్రేమ‌క‌థ‌తో ఘ‌ర్ష‌ణ‌లు

Update: 2021-12-29 14:30 GMT
ఊహించని ట్విస్టుతో ఉత్త‌రాది రిలీజ్ ల‌కు ఊపిరాడ‌డం లేదు. నైట్ క‌ర్ఫ్యూలు ఎవ‌రూ ఊహించ‌నిది. ఇటీవ‌ల డిస్నీ హాట్ స్టార్ లో విడుద‌లైన `అత్రంగి రే` వివాదాల్లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. సినిమా బాగుంద‌ని పాజిటివ్ టాక్ వ‌చ్చినా ఓ వ‌ర్గం ఈ సినిమాని బ్యాన్ చేయాల‌ని డిమాండ్ చేస్తోంది. ఈ సినిమా ద్వారా ల‌వ్ జిహాద్ ని ప్రోత్స‌హిస్తున్నార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ మండిప‌డుతున్నారు. `బ్యాన్ అట్రాంగి రే` అనేది ఇప్పుడు ట్విట‌ర్ లో ట్రెండింగ్ లో ఉంది. చాలామంది ట్విట‌ర్ వినియోగ‌దారులు సినిమాని నెగిటివ్ కామెంట్ల‌తో విమ‌ర్శిస్తున్నారు. ఇంత‌గా సినిమాపై ఎందుకు వ్యతిరేక‌త వ‌చ్చింది? అంటే చాలా కార‌ణాలే ఉన్నాయి. ఇందులో అక్ష‌య్ కుమార్ ని ముస్లీం వ్య‌క్తిగా (స‌జ్జ‌ద్ అలీఖాన్) చూపించడం..

సారా అలీకాన్ ని ( రింకూ ర‌ఘువంశీ) హిందూ అమ్మాయి పాత్ర‌లోనూ చూపించ‌డ‌మే గాక‌.. హిందు -ముస్లీమ్ ల ప్రేమక‌థ‌ను చూప‌డం వివాదాస్ప‌దంగా మారింది.

హిందువులు-ముస్లీములు పెళ్లి చేసుకోవ‌డం సినిమాలో చూపించ‌డం స‌రికాదంటూ ఓ నెటిజ‌నుడు కామెంట్ చేసాడు. ఇలా చేస్తే ల‌వ్ జిహాద్ ని ప్రోత్స‌హిస్తున్న‌ట్లేన‌ని మండిప‌డ్డాడు. ఇలాంటి వాటికి ముగింపు ప‌లికి హిందీ ప‌రిశ్ర‌మ‌కే ప‌గ్గాలు వేయాలంటూ నెటిజ‌నులు కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ ఎప్పుడూ హిందు మ‌తాన్ని టార్గెట్ చేస్తుంది. ఎన్నో సంద‌ర్భాల్లో హిందువ‌లు మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా సినిమాలు తీసారు.

హిందువులు సౌమ్యులు..స‌హ‌నంగా ఉన్నార‌ని త‌ప్పించుకోవ‌చ్చ‌ని వారు అనుకుంటున్నారని ఓ నెటిజ‌నుడు భ‌గ్గుమ‌న్నాడు. ఇటు ముస్లిములు.. అటు హిందువులు దీనిపై సీరియ‌స్ గా ఉన్నారు. ఇందులో అక్ష‌య్ కుమార్ ఇలాంటి పాత్ర పోషించ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. ఒక పెద్ద వ‌ర్గం..జాతీయ వాది..హిందువు అని పిలిపించుకునే అక్ష‌య్ కుమార్ ఇలాంటి పాత్ర‌లు పోషించ‌డం హిందు మ‌తాన్ని ఇబ్బందుల్లోకి లాగుతుంద‌ని మ‌రో నెటి జ‌నుడు కామెంట్ చేసాడు. ఈ వివాదంలోకి దివంగ‌త న‌టుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ద్ద‌తుదారులు కూడా త‌లదూర్చారు. సుశాంత్ తో వేరే స‌మ‌స్య‌ని క‌నెక్ట్ చేసి ..దివంగత న‌టుడికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

హిందు-ముస్లీం ల‌వ్ స్టోరీల‌తో వివాదాలు కొత్తేమీ కాదు. అప్ప‌ట్లో మ‌ణిర‌త్నం బొంబాయి సినిమాని హిందు-ముస్లీమ్ ప్రేమ పెళ్లి నేప‌థ్యంలో తెర‌కెక్కించ‌డం వివాదానికి కార‌ణ‌మైంది. ఆ సినిమా రిలీజ్ స‌య‌యంలో ముంబై..హైద‌రాబాద్ ముస్లీం ప్రాంతాల్లో ఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్తడంతో క‌ర్ఫ్యూలు విధించారు. అయితే `అట్రాంగి రే` ఓటీటీలో రిలీజ్ అయింది కాబ‌ట్టి ఆ స‌న్నివేశానికి ఆస్కారం లేదు. ఒక‌వేళ థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసి ఉంటే ఇది కూడా ఎలాంటి ప్ర‌మాదాల‌కు కార‌ణ‌మ‌య్యేదో ఊహించ‌లేనిది.
Tags:    

Similar News