టీజ‌ర్ టాక్ః ‘బ‌జార్ రౌడీ’.. రొటీన్ కామెడీయేనా?

Update: 2021-03-26 04:13 GMT
బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు హీరోగా వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘బజార్ రౌడీ’. కేఎస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై సందిరెడ్డి శ్రీనివాస‌రావు నిర్మిస్తున్నారు. మ‌హేశ్వ‌రి వ‌ద్ది హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు మేక‌ర్స్‌.

టీజ‌ర్ ఆరంభంలోనే జీపును త‌న్నేసి గింగ‌రాలు తిప్పేసిన సంపూ.. రౌడీల‌కు రౌడీయిజం పాఠాలు బోధిస్తూ క‌నిపించాడు. ‘‘జీపు, జీపులో పెట్రోలు, అందులో రౌడీలు కాదు.. గుండెల్లో దమ్ముండాలి’ అంటూ డైలాగులు వదిలాడు. ఆ త‌ర్వాత బ‌ర్నింగ్ స్టార్ ను చూస్తూ సిగ్గుప‌డే హీరోయిన్లతో చిన్న‌పాటి రొమాన్సులు క‌నిపించాయి.

ఇక‌, సెకండ్ వెర్ష‌న్ లో అత్తామామ‌ల‌ను టీజ్ చేశాడు.. అమ్మాయిల‌తో స్టెప్పులేశాడు. ఇందులోని సంపూ బాడీ లాగ్వేంజ్‌, భారీ డైలాగులు గ‌త చిత్రాల‌ను గుర్తు చేశాయి. కామెడీ యాంగిల్ కూడా అలాగే క‌నిపించింది. దీంతో.. రొటీన్ కామెడీయేనా? అనే సందేహం క‌లుగుతోంది. ఈ నేప‌థ్యంలో క‌థ‌నం ఎలా సాగ‌నుంద‌న్న‌దే ఆస‌క్తిక‌రం. షాయాజీ షిండే, నాగినీడు, 30ఇయ‌ర్స్ పృథ్వీ, స‌మీర్, క‌త్తి మ‌హేష్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రాన్ని.. స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.Full View
Tags:    

Similar News