నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇప్పటికే సింహా మరియు లెజెండ్ లు వచ్చిన నేపథ్యంలో హ్యాట్రిక్ కోసం రాబోతున్న మూవీ షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్లుగా సమాచారం అందుతోంది. మే నెలలో రాబోతున్న బిబి3 మూవీ టైటిల్ ను ఇంకా ఖరారు చేయలేదు. ఉగాది సందర్బంగా ఈ టైటిల్ ను ప్రకటిస్తారనే సమాచారం అందుతోంది.
వీరి కాంబోలో వచ్చిన మొదటి రెండు సినిమాల టైటిల్స్ మాదిరిగానే ఈ సినిమా టైటిల్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండేలా బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ అంటూ బయట ఒక స్టోరీ లైన్ చక్కర్లు కొడుతోంది. అది విన్న వారు కాస్త అనుష్క నటించిన భాగమతి సినిమాను గుర్తు చేసుకుంటున్నారు.
భాగమతి సినిమాలో అనుష్క కలెక్టర్ కాగా ఆ సినిమా లో మంచి పనులు చేసే సామాజిక వేత్త అయిన హీరోతో ప్రేమలో పడుతుంది. కలెక్టర్ సామాన్య వ్యక్తితో ప్రేమల పడ్డట్లుగా భాగమతిలో చూపించారు. బిబి3 సినిమా లో కూడా కలెక్టర్ అయిన ప్రగ్యా జైస్వాల్ తన జిల్లాలో మంచి పనులు చేసి జనాల్లో దేవుడిగా నిలిచిన బాలయ్య ను ప్రేమిస్తుంది. ఇద్దరి ప్రేమ పెళ్లికి దారి తీస్తుందట. ప్రేమ మరియు పెళ్లి విషయాలను హైలైట్ చేయకుండా ఇతర కథను బోయపాటి ముందుకు సాగిస్తాడట.
బోయపాటి మరియు ప్రగ్యా జైస్వాల్ ల కాంబోలో లవ్ కమ్ రొమాంటిక్ సీన్స్ ఒక మోస్తరు వరకు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి కాస్త భాగమతి తరహాలో ఉన్నా బిబి3 సినిమా ఫలితం మాత్రం తప్పకుండా బాగుంటుందనే నమ్మకంను నందమూరి అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏంటీ అనేది సినిమా విడుదల తర్వాత కాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు.