'అరవింద సమేత' రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఒకవైపు ప్రమోషన్స్ హోరు కొనసాగుతుండగా మరోవైపు అడ్వాన్సు బుకింగులు కూడా జోరుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే 'అరవింద సమేత' కు UK లో సెన్సార్ పూర్తయింది. అక్కడ బ్రిటిష్ బోర్డు అఫ్ ఫిలిం క్లాసిఫికేషన్ (బీబీఎఫ్సీ) వారు సినిమా కు 15 రేటింగ్ తో సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే 15 ఏళ్ళ వయసు.. అంతకు మించి ఉండే వారు మాత్రమే ఈ సినిమాను చూడొచ్చు. 15 ఏళ్ళ కంటే తక్కువ వయసుండే పిల్లలకు బ్రిటన్ థియేటర్స్ లోకి నో ఎంట్రీ.
సినిమా రన్ టైమ్ 162 నిముషాలని ఇదొక యాక్షన్ డ్రామా అని తేల్చారు. ఇక సినిమాలో 'స్ట్రాంగ్ బ్లడీ వయోలెన్స్' ఉందని చెప్పారు. మనం తెలుగులోకి రఫ్ గా మారిస్తే రక్తపుటేరులు పారించారు అనుకోవచ్చు. ఇక సర్టిఫికేట్ సమ్మరీ లో 'తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకునే ఒక యువకుడి కథ అరవింద సమేత.. ఇదొక తెలుగు లాంగ్వేజ్ యాక్షన్ డ్రామా' అని చెప్పారు.
సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలో హింస ఉన్నప్పటికీ రక్తపుటేరులు పారేంత ఘోరంగా ఉండదు. ఒక స్టైలైజ్డ్ వెర్షన్ లో ఉంటుంది. గురూజీ సినిమాల్లో మెజారిటీ భాగం ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం వయోలెన్స్ విషయంలో బోయపాటి 2.0 గా మారినట్టు అర్థం అవుతోంది. బ్రిటన్ సెన్సారే కాదు ఇక్కడ మన లోకల్ సెన్సార్ వారు కూడా U/A సర్టిఫికేట్ ఇచ్చారు.. అంటే పెద్దలతో వస్తే మాత్రం పిల్లలకు ఎంట్రీ అన్నమాట. సెన్సార్ టాక్.. ప్రీ రిలీజ్ బజ్ అన్నీ కాసేపు పక్కన పెట్టండి "కదిరప్పా.. మంది లేరా కత్తుల్లేవా... " అని గట్టిగా ఓ పొలికేక పెట్టండి. మీరింట్లో ఉంటే ఇంట్లో పక్కన ఉండే వారు.. ఆఫీసుల్లో ఉంటే కొలీగ్స్ జడుసుకొని ఛావాలి..!