వర్మ షేర్ చేసిన అప్సర బూతు అందం

Update: 2022-08-27 11:30 GMT
అప్సర రాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వర్మ కంపెనీ నుండి హీరోయిన్ గా పరిచయం అయిన ఈ అమ్మడు ఇప్పుడు సోషల్‌ మీడియా ను కుదిపేస్తుంది. ఇండస్ట్రీ లో అడుగు పెట్టి చాలా కాలం అయినా కూడా వర్మ కంపెనీలో అడుగు పెట్టిన తర్వాత మాత్రమే అప్సర రాణి కి గుర్తింపు దక్కింది. అది కూడా రామ్ గోపాల్ వర్మ వింత పైత్యం వల్లే ఆమెకు గుర్తింపు దక్కింది.

వరుసగా అప్సర రాణి తో రెండు సినిమాలు తెరకెక్కించిన వర్మ ఇంకా కూడా ఆమెతో సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆమెను ఒక అప్సరస అంటూ పొగుడుతూ ఉండే వర్మ ఆమె ఏ ఫోటో షేర్‌ చేసినా కూడా దాన్నీ రీ ట్వీట్‌ చేయడం.. రీ షేర్ చేయడం కామన్ విషయం. తాజాగా ఆమె షేర్ చేసిన ఈ బూతు ఫోటోను వర్మ రీ ట్వీట్‌ చేశాడు.

ఈ ఫోటో పై తీవ్ర స్థాయిలో నెటిజన్స్ విమర్శలు కురిపిస్తున్నారు. అయినా కూడా ఆమె మాత్రం తన అందాల ఆరబోత కంటిన్యూ చేస్తూ ఉంది. పైగా ఆ ఫోటోలను వర్మ ఇలా ట్వీట్‌ చేసి వావ్‌ వాట్ ఏ అందం అంటూ కామెంట్స్ పెడుతూ మరింత మందికి ఆ ఫోటోను షేర్ చేస్తున్నాడు అంటూ కొందరు వర్మ తీరుపై తీవ్ర స్థాయి లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరీ ఇలాంటి ఫోటోలను ఎలా షేర్ చేస్తావు అంటూ అప్సర ను విమర్శిస్తున్న నెటిజన్స్ రామ్ గోపాల్ వర్మ కు కనీస విజ్ఞత లేదా అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్మ కు విజ్ఞత కాదు ఏమీ ఉండదు. కనుక ఆయన షేర్‌ చేయడం ను తప్పబట్టలేం అంటున్నారు. అయితే అందమైన ఫోటోను షేర్‌ చేయడంలో తప్పేంటి అంటూ వర్మ అభిమానులు కొందరు ఆయన్ను సమర్థిస్తున్నారు.
Tags:    

Similar News