సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం పై పెద్ద ఎత్తున గళం విప్పుతున్న కంగనా రనౌత్ ప్రతి రోజు ఏదో ఒక మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. గత నెల రోజుల కాలంగా కంగనా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఒక హీరోపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ మాఫియాతో కలిసి అతడు చేసిన పని కారణంగా తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానంది.
2016 సంవత్సరంలో నేను నటించిన పలు సినిమాలు సక్సెస్ అవ్వడంతో ఆ సమయంలో నాకు 18 కంపెనీల నుండి ప్రచారకర్తగా ఉండే అవకాశం దక్కింది. అందులో కొన్నింటితో ఒప్పందం కూడా జరిగింది. ఆ సమయంలో ఆ హీరో నాపై తప్పుడు ప్రచారం మొదలు పెట్టాడు. నన్ను ఒక చెడ్డ మహిళగా అతడు చూపించే ప్రయత్నం చేశాడు. దాంతో నా కెరీర్ తలకిందులు అయ్యింది. అతడి కారణంగా నా కుటుంబ సభ్యులు బంధువులు కూడా నాతో దూరం అయ్యారు.
నాపై అతడు చేసిన తప్పుడు ప్రచారం కారణంగా నా వద్దకు వచ్చిన కంపెనీలు నాతో ఒప్పందంను రద్దు చేసుకున్నాయి. ఆ సమయంలో గుండు కొట్టించుకుని జనాలకు దూరంగా వెళ్లి పోవాలనిపించింది. పెళ్లి మీద కూడా నాకు ఆశ చచ్చి పోయింది. అతడి వల్ల నేను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ నుండి బయటకు వచ్చాను. నాకు నేనుగా దృడంగా మారానంటూ చెప్పుకొచ్చింది.