టెక్నాలజీ ఎంత పెరిగితే దాన్ని వినియోగించుకుని చెడ్డ పనులు చేసే వారు కూడా అంతే పెరుగుతున్నారు. ఈమద్య కాలంలో హ్యాకర్స్ ఎక్కువ అవుతున్నారు. సోషల్ మీడియా అకౌంట్స్ నుండి చివరకు వ్యక్తిగత ఫోన్ ను హ్యాక్ చేసే వరకు హ్యాకర్స్ ముదిరి పోయారు. ఆమద్య కాలంలో కొంతమంది స్టార్స్ ఐ ఫోన్స్ హ్యాక్ అయిన విషయం తెల్సిందే. తాజాగా హాలీవుడ్ నటి బెల్లా థ్రోన్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయ్యింది. అందులోని పర్సనల్ ఫొటోలు మరియు వీడియోలను కొందరు ఆకతాయిలు డౌన్ లోడ్ చేశారట.
జూన్ 15వ తారీకున ఆ ఆకతాయిలు బెల్లాను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారట. తాము కోరింది ఇవ్వకుంటే ఆ అసభ్య ఫొటోలను నెట్ లో పోస్ట్ చేస్తామంటూ బెదిరించారట. దాదాపు ఒక రోజంతా కూడా వారు ఇబ్బంది పెట్టడంతో ఏం చేయాలో పాలుపోక నిద్ర లేని రాత్రి గడిపిందట. ఆ తర్వాత వారి బ్లాక్ మెయిల్ కు కౌంటర్ ఇచ్చే ఉద్దేశ్యంతో ఏవైతే వారు బయట పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారో ఆ ఫొటోలనే బెల్లా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఈ ఫొటోలను వారు నెట్ లో పెట్టడం కంటే నేను డైరెక్ట్ గా పోస్ట్ చేయడం బెటర్. ఇప్పుడు నేను ప్రశాంతంగా నిద్ర పోతానంటూ చెప్పుకొచ్చింది.
వారు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్న సమయంలో నాకు ఏడుపు వచ్చింది. అందుకే ఇక ఈ సాహసం చేశాను. నా ఫొటోలను నేను పోస్ట్ చేయడంతో పాటు.. వారికి తగిన బుద్ది చెప్పాలనే ఉద్దేశ్యంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానంటూ బెల్లా థ్రోన్ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. అయితే తన ఫొటోలను హ్యాక్ చేసి బ్లాక్ మెయిల్ చేసింది టీనేజర్లు అని తెలిసి తన ఫిర్యాదును వెనక్కు తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. వారిపై చాలా కోపం వచ్చినా కూడా వారు తెలిసి తెలియక చేశారనిపించింది. అందుకే వారిని క్షమించానంటూ బెల్లా పేర్కొంది. మొత్తానికి బెల్లా థ్రోన్ చేసిన ఈ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.