నీ చారెడు క‌ళ్లే చ‌దివేస్తూ వున్నా..

Update: 2022-06-25 05:04 GMT
ప్ర‌ముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా ప‌రిచ‌య‌మై ఇప్ప‌టికే మంచి గుర్తింపుని సొంతం చేసుకుంటూ స్టార్ డ‌మ్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం 'ఛ‌త్ర‌ప‌తి' రీమేక్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇదిలా వుంటే బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో తెరంగేట్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. బెల్లంకొండ సురేష్ చిన్న కుమారుడు, బెల్లంకొండ శ్రీ‌నివాస్ సోద‌రుడు బెల్లంకొండ గ‌ణేష్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు.  

సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై యువ నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్న చిత్రం 'స్వాతిముత్యం'. ఈ మూవీతో బెల్లంకొండ గ‌ణేష్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. వ‌ర్ష బొల్ల‌మ్మ హీరోయిన్ గా న‌టిస్తోంది. రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా రూపొందుతున్న ఈ మూవీ ద్వారా ల‌క్ష్మ‌ణ్ కె. కృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. సంక్రాంతి సంద‌ర్భంగా ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ గ్లింప్స్ ని విడుద‌ల చేశారు. విభిన్న‌మైన కాన్సెప్ట్ తో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నార‌ని ఫ‌స్ట్ గ్లింప్స్ తోనే స్ప‌ష్టం చేసింది చిత్ర బృందం.

'ఏరా అమ్మాయిని క‌లిశావా?.. పంతులు గారితో ఇప్పుడే మాట్లాడాను. అమ్మాయి వాళ్ల నాన్న‌కి ప‌ట్టింపులు ఎక్కువ ప‌ద్ద‌తి అది ఇది అని బుర్ర తినేస్తాడంటాడేంటీ? అనే డైలాగ్స్ తో మొద‌లైన ఫ‌స్ట్ గ్లింప్స్ ఆస‌క్తిక‌రంగా సాగింది. ఇక హీరో, హీరోయిన్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు.. 'నువ్వు వ‌ర్జినా.. అంటూ హీరోని హీరోయిన్ అడుగుతున్న తీరు సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. రోటీన్ చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ఈ మూవీ సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది.

తొలి చిత్రానికే రోటీన్ కథ‌ని కాకుండా భిన్న‌మైన క‌థ‌ని ఎంచుకుని బెల్లంకొండ గ‌ణేష్ త‌న ప్ర‌త్యేక‌త‌ని చాటుకున్నారనే కామెంట్ లు వినిపించాయి. స‌రికొత్త నేప‌థ్యంలో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీని ఆగ‌స్టు13న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. రిలీజ్ టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ ని మొద‌లు పెట్టింది. శ‌నివారం ఈ మూవీలోని ఫ‌స్ట్ సింగిల్ కు సంబంధించిన లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేసింది.

'నీ చారెడు క‌ళ్లే చ‌దివేస్తూ వున్నా.. 'అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేసింది. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందించ‌గా ఈ పాట‌కు కృష్ణ‌కాంత్ సాహిత్యం అందించ‌గా, అర్మాన్ మాలిక్‌, సంజ‌నా క‌ల్మాన్జే ఆల‌పించారు. ఈ పాట‌ని చిత్రీక‌రించిన తీరు, బెల్లంకొంగ గ‌ణేష్‌, వ‌ర్ష బొల్ల‌మ్మ‌ల మ‌ధ్య కుదిరిన కెమిస్ట్రీ ఈ పాట‌కు ప్ర‌ధాన హైలైట్ గా నిలుస్తోంది.

ఇక మెలోడీ ప్ర‌ధానంగా సాగే ఈ పాట‌కు మ‌హతి స్వ‌ర సాగ‌ర్ అందించిన బాణీలు పాట‌కు మ‌రింత వ‌న్నె తెచ్చాయి. ఫుల్ సాంగ్ ని జూన్ 27న విడుద‌ల చేయ‌బోతున్నారు. రావు ర‌మేష్‌, సుబ్బ‌రాజు, వెన్నెల కిషోర్‌, స‌ప్త‌గిరి, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, ప‌మ్మిసాయి, గోప‌రాజు ర‌మ‌ణ‌ శివ నారాయ‌ణ‌, ప్ర‌గ‌తి, సురేఖా వాణి, సునైనా, దివ్య‌శ్రీ‌పాద న‌టిస్తున్నారు.


Full View

Tags:    

Similar News