వరుస విజయాలతో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీను వైట్ల గత ఐదారేళ్లుగా ఎలాంటి స్ట్రగుల్ ఎదుర్కొంటున్నారో చూస్తున్నదే. స్నేహితులు వరుసగా అవకాశాలు ఇచ్చినా హిట్టు అన్న మాటే లేదు. ప్రస్తుతం అతనికో హిట్లు కావాలి. ప్రస్తుతం ఉన్న కెరీర్ డైలమా నుంచి బయటపడాలంటే బ్లాక్ బస్టర్ హిట్టు పడాలి. పైగా దానిని ఇకముందు కూడా కొనసాగించాలి. అందుకోసమే పట్టువదలని విక్రమార్కుడిలా శ్రీను వైట్ల ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. కానీ వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. తన లక్కీ ఛామ్మ్ మాస్ మహారాజా రవితేజ అయినా తనకు హిట్ ని అందిస్తాడని అతనితో చేసిన సినిమా 'అమర్ అక్బర్ ఆంటోనీ' ఎలాంటి ప్రభావాన్ని చూపించకపోవడం మైనస్ అయ్యింది.
దర్శకుడిగా మరింత రిస్క్ లో పడేయడం ఇబ్బందికరంగా మారింది. ఆ తర్వాత డైలమా స్థితిలో వున్న శ్రీను వైట్ల గత కొన్ని నెలలుగా స్క్రిప్టు రాసుకుని హీరో కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. అయితే అతని ట్రాక్ రికార్డ్ చూసి పలువురు ఛాన్సిచ్చేందుకే భయపడుతున్నారని టాక్ వినిపించింది. దీంతో శ్రీను వైట్లతో సినిమా చేయడానికి ఎవరూ ఆసక్తిని చూపించడం లేదు. ఈ సమయంలో యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్ ముందుకొచ్చినట్టు సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్ కూడా గత కొంత కాలంగా కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవలే రీమేక్ చిత్రం 'రాక్షసుడు'తో ఆకట్టుకున్నా సరైన బ్లాక్ బస్టర్ కెరీర్ కి అవసరం. కానీ ప్రస్తుతం శ్రీను శైలి చూస్తుంటే ఫ్లాప్ దర్శకుడికి అవకాశం ఇచ్చి డేర్ చేస్తున్నాడా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే వైట్ల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టు విషయంలో జాగ్రత్త తీసుకుని అవకాశం ఇస్తున్నాడా? అన్నది తెలియాల్సి ఉంది. ఢీతో మంచు విష్ణు, రెడీతో రామ్ కెరీర్‌లని శ్రీను వైట్ల మలుపు తిప్పిన విషయం తెలిసిందే. ఇదే పంథాలో తన ఫేట్‌ని కూడా మారుస్తాడన్న చిన్న ఆశతో బెల్లంకొండ శ్రీనివాస్ డైరెక్టర్ శ్రీను వైట్లతో కలిసి సినిమా చేయాలనుకుంటున్నాడట. ఈ సినిమా ద్వారా జెనీలియాకి రీ ఎంట్రీ ఇప్పించాలని.. ఆమె చేత ఓ స్పెషల్ క్యారెక్టర్ చేయించాలని శ్రీను వైట్ల ప్లాన్ చేస్తున్నాడట. వైట్ల ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.