బోయపాటి నిన్ను సెలక్ట్ చేసుకున్నాడా నానా?

Update: 2017-06-17 07:55 GMT
టాలీవుడ్లో పెద్ద పెద్ద ఫ్యామిలీలకు చెందిన కుర్రాళ్లకు కూడా దక్కని ఘనమైన అరంగేట్రం బెల్లంకొండ శ్రీనివాస్ కు దక్కింది. అతడి తొలి సినిమాకే తండ్రి బెల్లంకొండ సురేష్ రూ.40 కోట్ల దాకా బడ్జెట్ పెట్టాడు. వినాయక్ లాంటి స్టార్ దర్శకుడితో అతణ్ని అరంగేట్రం చేయించాడు. సమంత లాంటి హీరోయిన్నిచ్చాడు. ఇంకా తొలి సినిమాకు చాలానే చేశాడు. రెండో సినిమాగా ‘స్పీడున్నోడు’ లాంటి చిన్న ప్రాజెక్టు చేసినా.. మళ్లీ కొడుకు మూడో సినిమాకు బోయపాటి శ్రీను లాంటి స్టార్ దర్శకుడిని సెట్ చేశాడు సురేష్. బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి అడ్వాన్స్ తీసుకుని కమిట్మెంట్ ఇవ్వడం వల్ల బాలయ్యతో వందో సినిమా చేసే అవకాశాన్ని కూడా కోల్పోయాడు బోయపాటి. బెల్లంకొండ ఫ్యామిలీ అతణ్ని అంత గట్టిగా పట్టేసుకుంది.

ఐతే ‘జయ జానకి నాయక’ టైటిల్ లోగో లాంచ్ కార్యక్రమంలో బెల్లంకొండ శ్రీనివాస్ వినిపించిన కథ మరోలా ఉంది. తమ ఫ్యామిలీ బోయపాటిని సెలక్ట్ చేసుకోలేదని.. ఆయనే తనను సెలక్ట్ చేసుకున్నాడనే అర్థం వచ్చేలా మాట్లాడాడు శ్రీనివాస్. ‘‘నా తొలి సినిమా విడుదలైన వారం రోజులకు బోయపాటి గారు నాతో సినిమా చేయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారని తెలిసింది. నా ఆనందానికి అవధుల్లేవు. నాలో ఆయన ఏం చూశారో.. ఏం నచ్చిందో తెలియదు. ఆ విషయం ఇప్పటికీ అర్థం కావడం లేదు’’ అన్నాడు శ్రీనివాస్. ‘లెజెండ్’.. ‘సరైనోడు’ లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన దర్శకుడితో పని చేయడానికి టాలీవుడ్లో చాలామంది స్టార్లు రెడీ. అలాంటిది బోయపాటి.. ఏరి కోరి బెల్లంకొండ శ్రీనివాస్ ను ఎంచుకుంటాడా? కమిట్మెంట్ ఇచ్చాడు కాబట్టి.. భారీ పారితోషకం ఇస్తున్నారు కాబట్టి బెల్లంకొండ బాబుతో బోయపాటి సినిమా చేశాడన్నది బహిరంగ రహస్యం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News