బెల్లంకొండ శీను.. బోయపాటికి సెటైరా?

Update: 2015-12-13 03:53 GMT
‘అల్లుడు శీను’ సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడ బెల్లంకొండ శ్రీనివాస్. పెద్ద ఫ్యామిలీల హీరోలకు కూడా అరంగేట్రంలో పెట్టనంత భారీ ఖర్చు అతడి తొలి సినిమాకు పెట్టాడు బెల్లంకొండ సురేష్. పెట్టుబడితో పోలిస్తే నష్టాలొచ్చినా ఆ సినిమా మాత్రం బాగానే

ఆడింది. కుర్రాడి రెండో సినిమా కూడా భారీగానే ప్లాన్ చేశారు కానీ.. బెల్లంకొండ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో వర్కవుట్ కాలేదు. తాను కోరుకున్న బడ్జెట్ ఇవ్వకపోవడంతో బోయపాటి శ్రీను ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. అల్లు అర్జున్ తో ‘సరైనోడు’ సినిమా చేసుకున్నాడు. మరోవైపు శ్రీనివాస్.. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టాడు.

ఐతే బోయపాటి తమ సినిమా నుంచి వెళ్లిపోవడం వల్ల హర్టయి.. అతడికి రిటార్ట్ ఇవ్వడానికో ఏమో కానీ.. బోయపాటి సినిమా టైటిల్ తరహాలోనే శ్రీనివాస్ సినిమాను పేరు పెట్టుకున్నారు. ఈ సినిమా టైటిల్ ‘స్పీడున్నోడు’ అట. తమిళ సూపర్ హిట్ మూవీ ‘సుందరపాండ్యన్’కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీనివాస్ సరసన సోనారికా బడోరియా కథానాయికగా నటిస్తోంది. తెలుగు నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్టులో మార్పులు చేసినట్లు చెబుతున్నారు. టాకీ పార్ట్ పూర్తి కావస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావిస్తున్నారు. భీమనేనితో కలిసి బెల్లంకొండ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Tags:    

Similar News