బెంగాల్ టైగర్ పై రిలీజ్ రోజున రకరకాల టాక్స్ వినిపించాయి. రొటీన్ అనీ, కొత్త కంటెంట్ ఏం లేదని అనేశారు. అయితే మాస్ ను నమ్ముకుంటే.. ఏ రేంజ్ లో మాయ చేయచ్చో మరోసారి ప్రూవ్ చేస్తున్నాడు మాస్ మహరాజ్. తన ఎనర్జీకి తోడు అందాల భామలైన తమన్నా - రాశిఖన్నాల అందాలను నమ్ముకుని తీసి.. కలెక్షన్లు కుమ్మేస్తున్నాడు.
ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి.. నాలుగు రోజుల్లో బెంగాల్ టైగర్ రాబట్టిన కలెక్షన్ 16 కోట్ల 60 లక్షల రూపాయలు షేర్. ఇందులో 13.65 కోట్లు ఏపీ - తెంలగాణ రాష్ట్రాల నుంచే వచ్చాయి. కర్నాటక లో 1.65 కోట్లు పిండుకున్నాడు మాస్ మహరాజ్. 90 లక్షలు యూఎస్ బాక్సాఫీస్ నుంచి రాగా.. ఇతర ఏరియాల నుంచి 40 లక్షలు వచ్చాయి. మొత్తం 16.6 కోట్ల షేర్ కలెక్షన్ తో బాక్సాఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ మూవీ ప్రింట్ - పబ్లిసిటీ ఖర్చులతో కలిపి.. థియేటర్లకు అమ్మిన మొత్తం 22 కోట్లు. అంటే.. ఈ మొత్తాన్ని ఈజీగా లాగేస్తాడన్న మాట. మిగిలినదంతా లాభమే.
మొత్తానికి రవితేజ మరోసారి మాస్ పవర్ ఏంటో చూపించాడనే చెప్పాలి. ఈ ఏడాది ఫుల్ లెంగ్త్ మాస్ కమర్షియల్ సినిమాలు ఆడలేదనే లోటును.. డైరెక్టర్ సంపత్ నంది తీర్చేశాడు. పూర్తి స్థాయి నాన్ వెజ్ మూవీ అంటూ ప్రచారం చేయడం బాగానే కలిసొచ్చింది. మరోవైపు సోలో రిలీజ్ కూడా బెంగాల్ టైగర్ కు హెల్ప్ అయిందని చెప్పాలి. ఓ నెల్లాళ్లు వెయిట్ చేసినా.. ఆశించిన విజయం సాధించాడు రవితేజ. క్రిటిక్స్ కు నచ్చకపోయినా.. ఈ రొటీన్ ట్రీట్ తో ఆడియన్ష్ అండ్ ప్రొడ్యూసర్ ఫుల్ హ్యీపీ!!