మాస్ రాజా 75 శాతం లాగేశాడు

Update: 2015-12-16 11:30 GMT
ఓ మోస్తరు సినిమా పడాలే కానీ... తన స్టామినా ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు మాస్ రాజా. ‘బెంగాల్ టైగర్’ సినిమా మీద బయ్యర్లు పెట్టిన పెట్టుబడిలో 75 శాతం ఫస్ట్ వీకెండ్ లోనే వసూలు చేసి పెట్టాడు మాస్ రాజా. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.22 కోట్లు కాగా.. ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.16.6 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం విశేషం. గురువారం విడుదల కావడంతో లాంగ్ వీకెండ్ కలిసొచ్చింది. తొలి రోజు మంచి టాక్‌ తో మొదలైన సినిమా వీకెండ్ లో దున్నేసింది. పోటీలో వేరే సినిమాలు లేకపోవడం.. సరైన మాస్ సినిమా కోసం ఆ వర్గం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురు చూస్తుండటం ‘బెంగాల్ టైగర్’కు కలిసొచ్చింది.

ఒక్క నైజాం ఏరియాలో రూ.6 కోట్ల షేర్ - రూ.9.15 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది బెంగాల్ టైగర్. సీడెడ్ లో రూ.2.2 కోట్ల షేర్ వచ్చింది. ఆంధ్రాలో అన్ని ఏరియాలూ కలిపి 5.4 కోట్ల షేర్ వసూలైంది. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ కలిపి రూ.19.6 కోట్ల గ్రాస్ రాగా.. అందులో షేర్ రూ.13.65 కోట్లు. కర్ణాటకలో కూడా బెంగాల్ టైగర్ దుమ్ముదులిపాడు.

వారాంతంలోనే అక్కడ రూ.1.65 కోట్ల షేర్ వచ్చింది. అమెరికాలో రూ.90 లక్షలు, మిగతా ప్రాంతాల్లో రూ.40 లక్షలు వసూలయ్యాయి. బెంగాల్ టైగర్ ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.25.55 కోట్లని తేలింది. వీక్ డేస్ లోనూ ‘బెంగాల్ టైగర్’ ఓ మోస్తరు వసూళ్లతో సాగిపోతున్న నేపథ్యంలో రెండో వీకెండ్ అయ్యేసరికి బయ్యర్ల పెట్టుబడులు ఈజీగా తిరిగొచ్చేసే అవకాశాలున్నాయి.
Tags:    

Similar News