బెంగాళ్‌ టైగర్‌.. 'కిక్‌' ఇవ్వలేకపోయింది

Update: 2015-12-11 22:30 GMT
ఫుల్ ప్లెడ్జెడ్ నాన్ వెజ్ సినిమా అంటూ ప్రచారం చేసిన బెంగాల్ టైగర్.. బాక్సాఫీస్ దగ్గర కూడా అదే రేంజ్ కలెక్షన్స్ రాబడుతోంది. రిలీజ్ రోజు కలెక్షన్లలో, చాలా చోట్ల మాస్ మహరాజ్ లేటెస్ట్ మూవీ కిక్2 కలెక్షన్స్ కి దరిదాపుల్లోకి వచ్చింది. కొన్ని సెంటర్లలో ఎక్కువే వచ్చినా.. ఓవరాల్ గా మాత్రం కిక్2 నే టాప్ లో నిలుస్తోంది.

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో, కళ్యాణ్ రామ్ నిర్మాతగా వచ్చిన కిక్ 2, రిలీజ్ రోజున 5.77 కోట్ల వసూళ్లు సాధించింది. కానీ.. బెంగాల్ టైగర్ మాత్రం 5.28 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నైజాంలో 2.17 కోట్లు వస్తే సీడెడ్ లో 90 లక్షలు లభించింది. కోస్తా జిల్లాల్లో 2.21 కోట్ల షేర్ రాబట్టాడు బెంగాల్ టైగర్. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కలుపుకుంటే 6.49 కోట్ల షేర్ ను సాధించింది. మొత్తంగా అయితే రవితేజ్ కెరీర్ లో కిక్2నే టాప్ లో నిలిచింది. కిక్2 టీం మొత్తం హిట్ పేస్ లో ఉండడం దీనికి కారణంగా చెప్పచ్చు. సురేందర్ రెడ్డి రేసుగుర్రంతో బ్లాక్ బస్టర్ సాధిస్తే, మాస్ మహరాజ్ ఏమో పవర్ చూపించాడు. మరోవైపు కళ్యాణ్ రామ్ కూడా పటాస్ తో టపాసులు బాగానే పేల్చాడు. వీళ్ల కాంబినేషన్ లో రావడం, బాహుబలి-శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత రిలీజ్ కావడం... కిక్ 2 కి అడ్వాంటేజ్ అయింది.

మరోవైపు ఇప్పుడు టాలీవుడ్ లో కొంత ఉత్సాహం తగ్గిందనే చెప్పాలి. బ్రూస్ లీ - అఖిల్ వంటి ఫ్లాప్స్ కారణంగా పక్కా మాస్ ఎంటర్టెయినర్ల వైపు ప్రేక్షకులు ఎక్కువగా రావడం లేదని చెప్పచ్చు. మరోవైపు కిక్2 ఫ్లాప్ ఎఫెక్ట్ కూడా గట్టిగానే చూపిస్తోంది. కానీ బెంగాల్ టైగర్ విషయంలో ముందునుంచి మసాలా మూవీ అని చేసిన ప్రచారంతో... ఈ రేంజ్ కలెక్షన్స్ సాధ్యమైంది.

Tags:    

Similar News