కంటెంట్ కత్తిలా ఉంటే.. కలెక్షన్స్ ఖతర్నాక్ గా వస్తాయని ప్రూవ్ చేసింది భలేభలే మగాడివోయే. నానిని మతిమరుపు మగాడిగా మెయిన్ ప్లాట్ చేసి.. మారుతీ తెరకెక్కించిన ఈ చిత్రం.. కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. ఈ ఏడాది బిగ్గెస్ట్ మాదే అని మేకర్స్ సగర్వంగా ప్రకటించారంటే.. వారు ఎంత సంతోషంగా ఉన్నారో అర్ధమవుతుంది. అదేంటీ బాహుబలి - శ్రీమంతుడు ఉండగా.. భలేభలే మగాడివోయే పెద్ద హిట్ ఎలా అవుతుందనే ప్రశ్న సహజంగానే ఎదురవుతుంది.
అయితే. బాహుబలి ఖచ్చితంగా చరిత్ర సృష్టించిన సినిమానే. కానీ దీనికి పెట్టిన పెట్టుబడితో పోల్చితే.. వచ్చిన షేర్ ఓ మూడు రెట్లుంటుంది. అదే శ్రీమంతుడి విషయానికొస్తే.. కనీసం రెట్టింపు కూడా రాలేదు. కానీ నాని అలాక్కాదు. కేపిటల్ కి ఇప్పటికే ఐదు రెట్లు పిండేసుకున్నాడు. ఆరు కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన భలే మగాడికి.. 25 రోజుల్లో వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ అక్షరాలా 46 కోట్ల 45 లక్షలు. ఇక షేర్ విషయానికొస్తే. 25 కోట్ల 90 లక్షల రూపాయలు. ఇందులో ఆడియో రైట్స్ సంగతులు లేవు, శాటిలైట్ మొత్తంతో వచ్చిన మొత్తం కలపలేదు. ఇవి కూడా కలిపి, ఫుల్ రన్ లో వచ్చే మొత్తం మిక్స్ చేస్తే.. పెట్టుబడికి 7-8 రెట్లు అయిపోతుంది.
హిట్ లెక్కేయాలంటే పెట్టుబడి - కలెక్షన్ - లాభాలే కొలమానం. ఈ లెక్కన చూస్తే.. మరి భలేభలే మగాడివోయ్ అన్నిటికంటే పెద్ద హిట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అందుకే ఇది చిన్న చిత్రాలకు బెంచ్ మార్క్ గా నిలిచింది. ఇప్పుడు రాబోతోన్న మీడియం బడ్జెట్ సినిమాల టార్గెట్ దీన్ని అధిగమించడమే. పాతిక కోట్ల టార్గెట్ ని ఛేదిస్తేనే.. ఇక మీడియం బడ్జెట్ మూవీని బ్లాక్ బస్టర్ గా లెక్కపెట్టాలంటూ.. కొత్త లెక్కలు రాసిన ఘనత ఈ మగాడిది.