గత రెండు నెలల్లో బాహుబలి, శ్రీమంతుడు వచ్చినపుడు బాక్సాఫీస్ దగ్గర సందడి మామూలుగా లేదు. ఐతే ఆ రెండు శుక్రవారాలు తప్పితే.. మిగతా వారాల్లో పెద్దగా హడావుడి లేదు. ఇవి కాకుండా వచ్చిన మీడియం రేంజి సినిమాలు వేటికీ సందడే కనిపించలేదు. దీంతో ఈ రెండు నెలల్లో బాహుబలి, శ్రీమంతుడు తప్ప వేరే సినిమాల పేర్లు పెద్దగా చర్చకు రాలేదు. ఐతే ఈ శుక్రవారం రాబోయే రెండు మీడియం రేంజి సినిమాలు తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తున్నాయి. వీటితో పాటు వచ్చే తమిళ డబ్బింగ్ సినిమా కూడా ఆసక్తి రేపుతోంది. భలే భలే మగాడివోయ్, డైనమైట్, జయసూర్య.. ఇవీ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న సినిమాలు. ఈ మూడు సినిమాలు కూడా బాగుంటాయన్న ఫీలింగ్ కలిగిస్తుండటం విశేషం.
నాని సినిమాల్లో దేనికీ రానంత క్రేజ్ 'భలే భలే మగాడివోయ్'కి వచ్చింది. గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మారుతి దర్శకుడు. దీనికి ముందు మారుతి ఏవరేజ్ సినిమా తీసినప్పటికీ.. భలే భలే.. మీద మాత్రం అంచనాలు భారీగా ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమా ఆసక్తి రేపుతోంది. ప్రమోషన్ కూడా చాలా డిఫరెంటుగా సాగుతోంది. ట్రైలర్ సినిమా మీద అంచనాల్ని మరింత పెంచింది. నిర్మాతల కాన్ఫిడెన్స్ చూస్తుంటే సినిమా సూపర్ హిట్టవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక డైనమైట్ విషయానికొస్తే.. ఇది తమిళంలో సూపర్ హిట్టయిన 'అరిమా నంబి'కి రీమేక్. అరిమానంబి సాలిడ్ కంటెంట్ ఉన్న థ్రిల్లర్ కావడం, దేవా కట్టా లాంటి ప్రతిభావంతుడు దీన్ని రీమేక్ చేయడంతో 'డైనమైట్' నిరాశ పరచదనే అనుకుంటున్నారు. ఇక విశాల్, కాజల్ జంటగా నటించిన 'జయసూర్య' ట్రైలర్ కూడా ఆసక్తి రేపింది. దీని దర్శకుడు సుశీంద్రన్ కు మంచి ట్రాక్ రికార్డుంది. కాబట్టి ఈ సినిమా కూడా బాగుండే అవకాశాలున్నాయి. మొత్తానికి ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలన్నింట్లోనూ హిట్టు కళ తాండవిస్తోంది. మరి ఏది ఎలాంటి ఫలితాన్ని చూస్తుందో?