మొన్నటివరకు ఏదో శపథం అంటూ చాలా వార్తలే వచ్చాయి. తనపై అక్రమానికి ఒడిగట్టిన దోషులకు శిక్ష పడేవరకు అసలు ఇంట్లో నుండి బయటకు రానని.. తిరిగి మేకప్ వేసుకోనని.. అమ్మడు చెప్పినట్లు బయటకొచ్చింది. దానితో కెరియర్ దాదాపు ఓవర్.. ఆమె రిటైరైనట్లే అనుకున్నారు అందరూ. అయితే ఇప్పుడు అనూహ్యంగా అందరికీ షాకిచ్చింది టాలెంటెడ్ హీరోయిన్ భావన.
ఈ మల్లూ కుట్టి నిన్నటి నుండి తన లేటెస్టు సినిమా షూటింగులో తిరిగి పాల్గొనడం ప్రారంభించేసింది. స్టార్ హీరో పృథ్వీ రాజ్ సరసన ఈమె 'యాడమ్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక పొద్దున్నే భావన సెట్లో కనిపించడంతో అందరూ షాకైపోయారు అంతే. కేవలం ఒక్క వారం గ్యాపులో భావన పూర్తి స్థాయిలో మానసికంగా కోలుకుని తిరిగి సెట్ కు రావడం అనేది చాలా పెద్ద విషయమే. ఆమె మనోబలం.. గట్స్.. ఆమెకే సాటి. అందుకే ఇప్పుడు అందరూ అదుర్శ్ అనిపించావ్ భావన అంటున్నారు.
ఇక ఆమె కేసు విషయానికి వస్తే.. గత వారం భావన కారును కావాలనే గుద్దేసి ఏడుగురు ఆగంతుకులు ఆమెపై దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆమెను వివస్ర్తను చేసి అర్ధనగ్నంగా కొన్ని ఫోటోలు వీడియోలు చిత్రీకరించారని పోలీసు ఎఫ్.ఐ.ఆర్ లో భావన పేర్కొన్నట్లు మలయాళ మీడియాలు ప్రచురించాయి. అయితే ఈ కేసుకు సంబంధించిన ప్రత్యక్ష దోషులను ఆల్రెడీ అరెస్టు చేయగా.. దీనికి ఎవరి హస్తం ఉందనే విషయం కనిపెట్టడంలో పోలీసులు బీజీగా ఉన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/