లైంగిక దాడిపై లైవ్ లోభావ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2022-03-07 04:49 GMT
మ‌ల‌యాళం హీరోయిన్ భావ‌న పై జ‌రిగిన లైంగిక దాడి ఐదేళ్ల క్రితం ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే.  ఒంట‌రిగా వ‌స్తోన్న  భావ‌నని కిడ్నాప్ చేసి కొంత మంది దుండ‌గులు అత్యాచారం చేసారు. ఈ దాడి వెనుక మాలీవుడ్ హీరో దిలీప్ కుమార్ సూత్ర‌ధారిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కుని కొన్ని నెల‌లు పాటు  జైలుకెళ్లి బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు.

ఈ కేసు ఇంకా విచార‌ణ‌లోనే ఉంది. అస‌లు  నిందుతుల‌కు ఇంకా శిక్ష ప‌డ‌లేదు. ఈ విష‌యంలో మీడియా సైంత భావ‌న పేరుని పెద్ద‌గా హైలైట్ చేయలేదు. ఓ ప్ర‌ముఖ‌  హీరోయిన్ అని మాత్ర‌మే ఇన్నాళ్లు రాసుకొచ్చింది.

అప్పుడు భావ‌న మీడియా ముందుకు రాక‌పోవ‌డంతోనే ఈ వ్య‌వ‌హారంలో మీడియా సైతం గోప్య‌త వ‌హించింది.   అయితే కేసులో ఎలాంటి పురోగ‌తి క‌నిపించ‌క‌పోవ‌డంతో ఈసారి నేరుగా భావ‌న ముందుకొచ్చారు. మౌనంగా ఉంటే లాభం లేద‌నుకున్న భావ‌న న్యాయం కోసం పోరాటానికి దిగారు.

ఇటీవ‌లే ఈ కేసు పురోగ‌తి గురించి కేర‌ళ  ముఖ్య‌మంత్రి  విజ‌య్ ని బ‌హిరంగ లేఖ రాసారు. తాజాగా ఈ విష‌యంపై ప‌బ్లిక్ గా ఓ నేష‌న‌ల్ ఛాన‌ల్ తోనూ మాట్లాడారు. లైంగిక దాడి కార‌ణంగా మాన‌సికంగా ఎంతో కృంగిపోయాన‌ని లైవ్ కార్య‌క్ర‌మంలో చెప్పుకొచ్చారు.

ఆ దాడి త‌న‌ని  మానసికంగా దెబ్బ తీసింద‌ని వాపోయారు. అయితే ఆ త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాలు అంత‌కు మించి బాధ‌ని..మ‌నోవేద‌న‌ని మిగిల్చుతున్నాయ‌ని పేర్కొన్నారు. ``న్యాయం  జ‌రగ‌లాని చాలా మంది నిల‌బ‌డ్డారు.  కానీ అదే స‌మ‌యంలో  నింద‌లు వేసే వ‌ర్గం అంతే వెంటాడింది.

ఆ స‌మ‌యంలో ఎందుకు బ‌య‌ట‌కు వెళ్లాన‌ని ఎన్నో ప్ర‌శ్న‌లు వేసి ఇబ్బంది పెట్టారు. త‌ప్పంతా నాదే అన్న‌ట్లు మాట్లాడారు. ఈ వ్యాఖ్య‌లు న‌న్ను..నా కుటుంబాన్ని ఎంతో భాద‌కు గురిచేసాయి.

2019 వ‌ర‌కూ సోష‌ల్ మీడియాలో లేను. అప్పుడే ఇన్ స్టా గ్రామ్ లోకి వ‌చ్చాను. లైంగిక దాడి త‌ర్వాత ఇంకా ఎందుకు బ్ర‌తికున్నావ్?  నీలాంటి వాళ్ల‌కు బ్ర‌తికే అర్హ‌త లేదంటూ  అంటూ ఎన్నో కామెంట్లు చేసారు. వాట‌న్నింటిని ఇన్నాళ్లు భ‌రిస్తూ వ‌చ్చాను. త‌ప్పు చేయ‌న‌ప్పుడు నేనెందుకు దాక్కోవాలి. ఎందుకు మౌనం  వ‌హించాలి? అనే ఉద్దేశంతోనే దాడి విష‌యంలో ఓపెన్ గా మాట్లాడుతున్నాను. అందుకే  సీఎంకి లేఖ ఇలా ఓపెన్ అవ్వ‌డం ఎంతో మంది మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. విమ‌ర్శించే వాళ్లు ఎప్పుడూ  ఉంటారు. వాళ్ల‌ను ప‌ట్టించుకుంటే  జీవితంలో ముందుకు వెళ్ల‌లేం. అందుకే ధైర్యంగా ఇలా ముందుకొచ్చాను`` అని  తెలిపారు.

బాధితురాలే  న్యాయ పోరాటం కోసం దిగింది కాబ‌ట్టి ఈ కేసు విష‌యంలో స‌త్వ‌ర ప‌రిష్కారం దొరికే అవ‌కాశం ఉంది.
Tags:    

Similar News